యూనిట్
Flash News
ఆంధ్రప్రదేశ్ పోలీసు టెక్నికల్ విభాగానికి రెండు జాతీయ పురష్కారాలు
ఆధునిక
టెక్నాలజి తో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ టెక్నాలజి , ట్రైనింగ్ విభాగం లో
జాతీయ స్థాయిలో రెండు ఉత్తమ పురస్కారలను సొంతం చేసుకుంది. డిల్లీలో
జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పోలీస్
కమ్యూనికేషన్ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ. జి.కిషన్ రెడ్డి గారి
చేతుల మీదుగా పురస్కారాన్ని శ్రీమతి
ఎన్.యెస్.జె.లక్ష్మి, డి.ఐ.జీ కమ్యూనికేషన
అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు
విజయవంతంగా వినియోగిస్తున్న రేస్ ప్రాజెక్ట్ కు దేశంలోనే ఉత్తమ అవార్డు
లభించింది.
RACE- Remote Area Communication Enhancement
. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని
మారుమూల గ్రామలకు సైతం చేరువయ్యే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజి తో ప్రవేశ పెట్టిన అదునాతన కమ్యూనికేషన్ వ్యస్థతో ఆంధ్రప్రదేశ్
పోలీసులు ఆవిష్కరించిన రేస్ వాహనం జాతీయ స్థాయిలో
అవార్డును సొంతం చేసుకుంది.
బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి రెండో పురస్కారం
అత్యాధునిక
సాంకేతిక పరికరాలు డ్రోన్ , బాడీ ఓన్ కెమెరా , సీసీటీవీ
కెమెరా ,
LHMS , బ్రీత్ యనలైజర్స్ , లేజర్ గన్లు , మొబైల్
అప్లికేషన్ ల వినియోగం పై సిబ్బందికి శిక్షణ మరియు పూర్తి స్థాయిలో వినియోగం పై
అవగాహన కల్పించినందుకు గాను అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో టెక్నికల్ విభాగంలో
అవార్డులు సాధించినందుకు ఆంధ్రప్రదేశ్ డి
జి పి శ్రీ దామోధర్ గౌతమ్ సవాంగ్ గారు కృషి చేసిన డి. ఐ. జీ టెక్నికల్ సర్వీస్
జి.పాలరాజుని మరియు అవార్డు అందుకున్న కమ్యూనికేషన్ డి. ఐ. జీని అభినందించారు.