యూనిట్
Flash News
జంట హత్య కేసులో నిందితుల అరెస్టు

అనంతపురం
ఇటీవల జరిగిన ఓ హత్య కేసును ఛేదించే క్రమంలో మరో రెండు హత్యలు బయటపడ్డాయి. ఈ మూడు హత్యలకు పాల్పడిన
నిందితుడితో కలిపి ఇద్దరు నిందితులను ధర్మవరం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.
వేర్వేరు సందర్భాలలో జరిగిన ఈ మూడు హత్యల కేసుల నిందితుడితో సహజీవనం చేస్తున్న
మహిళే తాజా కేసులో రెండవ నిందితురాలు. వీరిద్దరి సహజీవనంలో చిచ్చుపెట్టేలా
వ్యవహరిస్తున్నాడని సదరు మహిళతో కలసి స్నేహితుడినే చంపి ఆ శవాన్ని వంక నీటిలో
పారేశాడు. గత హత్య కేసుల తరహాలోనే ఎవరు కనుక్కోలేరని భావించాడు. తీగ లాగితే డొంక
కదిలిన చందంగా పోలీసుల చాకచక్యంతో ఆ రెండు హత్యలు బయటపడ్డాయి. మొత్తం మూడు హత్యలలో
ఒక మహిళతో పాటు ఆరుగురు నిందితులు కాగా ప్రస్తుతం ఇద్దర్ని అరెస్టు చేశారు... మరో
ఇద్దరు నిందితులు చనిపోయారు. ఇంకో ఇద్దరు అరెస్ట్ కావలసి ఉందని జిల్లా ఎస్పీ
భూసారపు సత్య ఏసుబాబు వెల్లడించారు.
ధర్మవరం
మండలం, మోటుమర్ల వంక నీటిలో ఒక గుర్తు
తెలియని శవం పడి ఉన్నట్లు ధర్మవరం పోలీసులు సమాచారం అందుకున్నారు. ధర్మవరం రూరల్
పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికెళ్లి శవాన్ని నీటిలో నుండి బయటికి తీయించారు.
మృతుడు ప్యాంటు జేబులో లభ్యమైన ఆధార్ కార్డ్ ఆధారముగా ధర్మవరం పట్టణం, లక్ష్మీచెన్నకేశవపురంకు చెందిన బొగ్గు రామాంజినేయులుగా గుర్తించారు. మృత దేహాంపై గాయాల ఆధారంగా హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు
ప్రారంభించారు. ఈ హత్యకేసును ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక బదంగా ఏర్పడ్డారు.
పక్కా సమాచారంతో హత్యలో పాల్గొన్న నిందితులిద్దర్నీ మోటుమర్ల బ్రిడ్జ్ వద్ద
అరెస్టు చేశారు. ధర్మవరం పట్టణానికి చెందిన బొగ్గు రామాంజినేయులు బేల్దారి వృత్తి
ద్వారా జీవించేవాడు. ఇతనికి 16 సం.ల
క్రితం వరలక్ష్మితో ప్రేమ వివాహము జరిగింది. వీరికి కూతురు, కొడుకు
ఉన్నారు. మద్యం సేవించి తరుచూ ఎవరితోపడితే వారితో గొడవపడేవాడు.
ఇది
భరించలేని బార్య, ఇతనిని వదిలి
పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుండి ఇతను ధర్మవరం వదలి తిరుపతి,
మదనపల్లి ప్రాంతాలలో బేల్దారి పనులు చేస్తూ జీవించేవాడు. పిల్లలను
చూసేందుకు అప్పుడప్పుడు ధర్మవరం వచ్చేవాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడు బాబ్జాన్
ఇంటికెళ్లేవాడు. బాబ్జాన్ వివాహిత సరస్వతితో సహజీవనం చేసేవాడు. రామాంజినేయులుకు
ఈమెపై మోజుపడి కోర్కె తీర్చమని సతాయించేవాడు. బాబ్జాన్, సరస్వతులు
ఇతనిని కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. రామాంజినేయులు సరస్వతి ఇంటి దగ్గరకు
వెళ్ళి గొడవ చేసినాడు. ఇదే అదునుగా భావించి బొగ్గు రామాంజినేయులుపై రొకలితో తలపై
బాది చంపారు. శవం ఆనవాలు గుర్తించకుండా ఉండేలా కాళ్ళు, చేతులు
తాడుతో కట్టి, ఆ శవాన్ని ఒక చాపలో చుట్టి ద్విచక్ర వాహనంపై
తీసికెళ్లి మతదేహం తేలకుండా వీపుకు పెద్ద రాయి కట్టి మోటుమర్ల వంక నీటిలో పడేశారు.
విచారణలో ఈ హత్యతో పాటు గతంలో చేసిన రెండు హత్యలు బయటపడ్డాయి. 2010లో కంసలి రామాచారిని చంపిన కేసులో బాబ్జాన్ నిందితుడు.
మరో
ముగ్గురితో కలసి సి.కె. పల్లి మండలం, యెర్రోనిపల్లి వద్దకు రామాచారిని ఆటోలో తీసుకెళ్లి క్లచ్ వైరుతో గొంతు
బిగించి చంపారు. సమీప పొలాల్లో ఆ శవాన్ని పూడ్చిపెట్టారు. ఈఘటనపై ఎలాంటి కేసు
నమోదు కాలేదు. ఈ కేసులో బాబ్జాన్తో పాటు చాంద్ బాషా, షేక్సావలి,
కుళ్లాయప్పలు నిందితులు కాగా వీరిలో షేక్సావలి, కుళ్లాయప్పలు
వేర్వేరు రోడ్డు ప్రమాదాలులో ఇంతకు మునుపు చనిపోయారు. చాంద్ బాషా పరారీలో
ఉన్నాడు. ఆతర్వాత... 2015లో ఓ ప్రేమ వివాహ విషయంలో తలదూర్చి
మురళి అనే వ్యక్తిని కడతేర్చారు. మురళిని నమ్మించి గంగినేపల్లి గ్రామ సమీపంలోకి
ఆటోలో తీసుకుపోయి, రోకలి బండతో బాబ్జాన్ మరియు మహబూబ్
బాషాలు తలపైనా మరియు జనానాంగము పైన కొట్టి చంపారు. ఆ పరిసరాలలో శవాన్ని పూడ్చి
వాసన రాకుండా దష్టి మళ్ళించడానికి ఒక కుక్కను కూడా చంపి సమాధిపై వేశారు.
కేసు
నమోదయినా సాక్ష్యాలు లేనందున కేసు మూసివేశారు. గతంలో జరిగిన ఈ రెండు హత్య కేసులను
పున: ప్రారంభించి సమగ్ర దర్యాప్తు చేయనున్నారు. మొత్తం మూడు హత్యలలో ఒక మహిళతో
పాటు ఆరుగురు నిందితులు కాగా ప్రస్తుతం ఇద్దర్ని అరెస్టు చేశారు... ఇద్దరు అరెస్ట్
కావలసి ఉంది. మూడు హత్య కేసులను ఛేదించినధర్మవరం డీఎస్పీ రమాకాంత్, ధర్మవరం రూరల్ సి.ఐ చిన్న పెద్దయ్య, ఎస్.ఐలు నగేష్ బాబు, శ్రీహర్ష మరియు సిబ్బందిని
జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు.