యూనిట్

పారదర్శకంగా కొనసాగిన కానిస్టేబుళ్ల బదిలీల ప్రక్రియ

ఆర్పీ ఎస్‌.ఐ.లు, ఏ.ఎస్‌.ఐ.లు, హెడ్‌ కానిస్టేబుళ్ల బదిలీల తరహానే 322 మంది కానిస్టేబుళ్లను అనంతపురం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు బదిలీలు చేశారు. పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో కానిస్టేబుళ్ల బదిలీల కోసం ఎస్పీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. పోలీసు స్టేషన్లో ఐదు సంవత్సరాలు పూర్తీ చేసుకున్న కానిస్టేబుళ్ల జాబితాను సిద్ధం చేసి కౌన్సెలింగ్‌కు పిలిచారు. మొత్తం 322 మందికి పోస్టింగులు ఇచ్చారు. ముందుగా... ఒకే చోట ఐదేళ్లు పూర్తీ చేసుకున్న సీనియార్టీ జాబితాను ప్రొజెక్టర్‌ పై ప్రదర్శింపజేశారు. జిల్లాలో ఉన్న కానిస్టేబుళ్ల ఖాళీలను అందులో చూపించారు. గతంలో పని చేసిన పోలీసు స్టేషన్ల వివరాలు కలిగిన ప్రతిని కూడా అందజేశారు. బదిలీల ప్రక్రియకు కొలమానమైన నిబంధనలు సిబ్బందికి ఎస్పీ స్పష్టంగా వివరించారు. స్పౌజ్‌ కేసుల్లో కన్సిడర్‌ చేసి వారికి అనుకూలమైన ప్రాంతాలకు పోస్టింగులు ఇచ్చారు. ఈ అర్హతలుతో ఉన్న కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ అక్కడికక్కడే బదిలీ ఉత్తర్వు/డి.ఒ ప్రతిని సిబ్బంది చేతికి అందజేయడం విశేషం. ఈ బదిలీల కౌన్సెలింగ్‌ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీమతి కె చౌడేశ్వరి, డీఎస్పీలు మహబూబ్‌ బాషా, శ్రీనివాసులు, మున్వర్‌ హుస్సేన్‌, జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంట్‌ నిజాముద్దీన్‌, అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌ నాథ్‌, సుధాకర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని