యూనిట్
Flash News
స్వాట్ బృందానికి ప్రపంచ స్థాయి శిక్షకులతో శిక్షణ

ప్రకాశం జిల్లా స్వాట్ బృందానికి తెలంగాణా స్టేట్ కమెండో శిక్షణా అకాడమీకి శిక్షణ నిమిత్తం ఎస్పీ సిద్ధార్థకౌశల్ గురువారం పంపించారు. ప్రపంచంలో అత్యున్నత స్థాయి మిలటరీ బలగం ఉన్న ఇజ్రాయిల్ దేశంలో శిక్షణ పొందిన శిక్షకులతో కమెండో ట్రైనింగ్ అకాడమీ ఇబ్రహీపట్నంలో ఉంది. అలాంటి శిక్షణా సంస్థలో స్వాట్ బృందానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు డీజీపీ గౌతమ్‌సవాంగ్, గుంటూరు రేంజి ఐజీ వినిత్‌బ్రిజ్‌లాల్‌లు తెలంగాణీ డీజీపీ మహేంద్రరెడ్డితో మాట్లాడి శిక్షణకు అనుమతి ఇప్పించారని ఎస్పీ చెప్పారు. ఈనెల 3 నుంచి 22వ తేదీ వరకు ఎన్‌ఎ్‌సజీ తరహా కమెండో శిక్షణ స్వాట్ బృందానికి ఇస్తారు.