యూనిట్

అనంతపురంలో ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక సమావేశం

         31 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలులో భాగంగా... జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బుధవారం స్థానిక ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ సమావేశంలో ట్రాఫిక్ డీఎస్పీ మున్వర్ హుస్సేన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా... రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలుపై అవగాహన చేశారు. ఆటో డ్రైవర్లు తప్పకుండా యూనిఫాం ధరించాలని... నగరంలో ఎక్కడంటే అక్కడ ఆటో ఆపకూడదని... ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని...  నిర్లక్షంగా మరియు అతి వేగంగా ఆటోలు నడపరాదని...మద్యం సేవించి ఆటో నడపకూడదని... తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని...ఆటోలకు తప్పనిసరిగా ఇన్సూరెన్సు చేయించాలని ... సెల్ ఫోన్ మాట్లాడుతూ ఆటో డ్రైవ్ చేయకూడదని... ఓవర్ లోడుతో ప్రయాణికులను ఎక్కించుకొని ఆటో నడపకూడదని... ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను & రోడ్డు ట్రాఫిక్ సంజ్ఞలను తప్పక పాటించాలని సూచనలు చేశారు. ఈ సమావేశంలో సూర్య నగర్ సర్కిల్, తాడిపత్రి బస్ స్టాండ్, జి‌జి‌హెచ్ ఆటో స్టాండ్ మరియు శ్రీకంఠం సర్కిల్ ఆటో  స్టాండ్ ల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

వార్తావాహిని