యూనిట్
Flash News
హత్య కేసు, తిరుపతి అర్బన్ పోలీసు

తిరుపతి నందు డిసెంబర్ 2019 లో ఎస్ కే పాస్ట్ పుడ్ సెంటర్, సుబాష్ నగర్ టర్నింగ్ వద్ద జరిగిన హత్య కేసును చాలెంజింగ్ తీసుకున్న తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి డా.గజరావు భూపాల్ , అడిషనల్ యస్.పి స్థాయి అధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముమ్మరం చేసారు. తదుపరి జిల్లా యస్.పి గారి ఆదేశాలపై ఈస్ట్ డిఎస్పీ టి . మురళి కృష్ణ వారి సూచనలతో దర్యాప్తు అధికారి తిరుపతి ఈస్ట్ సి ఐ శివప్రసాద్ రెడ్డి గారు, ఎస్ ఐ లు మరియు సిబ్బంది, పసుపులేటి మురళి హత్య కేసులో పాత్ర ఉన్న ముద్దాయిలను నిన్నటిదినం 07-01-2020వ తేదీ సాయంత్రం ముద్దాయిలను అరెస్టు చేసి, వారు హత్యకు ఉపయోగించిన ఒక ఆటో, రెండు స్కూటీలు, మూడు సెల్ ఫోనులు, రెండు ఇనుప రాడ్డులు, నాలుగు కత్తులు, స్వాధీనం చేసుకోవడమైనది. 21-12-2019వ తేదీ రాత్రి 8:20 నిమిషములకు SK పాస్ట్ పుడ్ సెంటర్, సుబాష్ నగర్ టర్నింగ్ వద్ద పసుపులేటి మురళి అను వ్యక్తిని కొందరు వ్యక్తులు మురళి తల పైన రాడ్డుతో గట్టిగా గబ గబా కొట్టి క్రింద పడిన మురళిని మరి కొందరు వీపుపైన పొడిచి, వారు ముందే సిద్దంగా ఉంచుకొన్నటువంటి ఆటో మరియు రెండు స్కూటీలలో పారిపోయినారు. మురళి బార్య సత్యా ఇచ్చిన ఫిర్యాదు పై తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్లో తేది 21.12.2019 న క్రైమ్ నెంబర్ 548/2019 U/s 302 R/w 32 IPC గా కేసు నమోదు చేయడమైనది. కేసు వివరాలలోకి వెళితే నెహ్రూనగర్ లో భార్గవ్ మరియు పసుపులేటి మురళి మొదట స్నేహితులుగా ఉండేవారు. తర్వాత కొన్ని రోజులకు సాకే భార్గవ్ కు మురళికి మధ్య విభేదాలు వచ్చినాయి. దానితో భార్గవ శత్రువు అయిన ప్రమోద్ @ ప్రమోద్ కుమార్ తో మురళి స్నేహము చేసినాడు. దానితో సాకే భార్గవ్ అతని స్నేహితులతో కలిసి 2017 సంవత్సరము అక్టోబరు నెల లో మురళి పైన దాడి చేయడం జరిగింది. దాని పైన పసుపులేటి మురళి తిరుపతి వెస్ట్ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టినాడు. తర్వాత మురళి మరియు ప్రమోద్ వారి స్నేహితులు కలసి దినం 02-12-2017 సంవత్సరములో రాత్రి 11-30 గంటలకు ఇంటికి వెల్లుతున్న సాకే భార్గవ్ ను పరసాల వీధిలో హత్య చేయడము జరిగినది. ఈ కేసు --- నమోదుచేయడమైనది. పసుపులేటి మురళి పైన రౌడీ షీటు కూడా ఓపెన్ చేయడమయినది. పసులేటి మురళి బెయిలు పై విడుదల అయిన తర్వాత పసుపులేటి మురళి నెహ్రూ నగర్ ను వదిలి తన భార్య బిడ్డలతో కలసి సుభాష్ నగర్ లోని ఇంటిలోకి వచ్చినాడు. సాకే భార్గవ్ హత్య కేసులో స్నేహితులను మరియు బంధువులు రాజీకి రాలేదని వారిని బెదిరించినాడు. 02-12-2019 న సాకే భార్గవ్ వర్ధంతి రోజున అన్నదానము చేయడం జరిగినది. అన్నదానం తర్వాత గుజ్జల గజేంద్ర తన ఇంటిలోకి ముద్దాయిలు 1) డి.నరసింహులు, 2) డి.మల్లికార్జున, 3) జి.అరుణ్ కుమార్ @ అరుణ్ @ కొండ అరుణ్, 4) కే.హరి కృష్ణ @ హరి, 5) కోయ గిరి బాబు @ నాగరాజు, 6) జి.సత్య శ్రీనివాసులు @ సత్తి, 7) రాఘవన్ దినేష్ @ దినేష్, 8) యం.మణికంఠ, 9) ఎన్.మహబూబ్ బాష @ బుల్లక్, 10) సాకే మహేష్, మరియు 11) నాగ విజయ్ కుమార్ @ భీమా లు సమావేశము అయినారు. గుజ్జుల గజేంద్ర మరియు సాకే మహేష్ లు పై ముద్దాయిలతో పసుపులేటి మురళి ని చంపండి అనగా వారు మాచేత కాదని చెప్పినందున, గుజ్జుల గజేంద్ర మరియు సాకే మహేష్ లు 4,00,000/- ఇస్తామని ఆరక్కోణం కు చెందిన కణ్ణన్ @ మని వన్నన్ తో మాట్లాడి మురళిని హత్య చేసి 4,00,000/- ఇస్తామని ఒప్పుకున్నారు. దినం 20.12.2019 రాత్రి తమిళనాడుకు చెందిన 1). కణ్ణన్ @ మని వన్నన్ 2). బాల @ బాలాజి 3). దివాకర్, 4). ఆర్.మహమ్మద్ వసీమ్, 5). ఎల్.డిల్లీ వన్నన్ @ కుమార్ 6). పి.కార్తీక్ వారు తిరుపతికి వచ్చినారు. వచ్చిన వారికి ఖర్చులకు రూ.10,000/- డబ్బులు ఇచ్చినారు. తరువాత వారు కూర్చొని మురళిని పథకం ప్రకారం చంపినారు.