యూనిట్

హేల్మట్ డ్రైవ్ నిర్వహించిన తిరుపతి అర్బన్ పోలీసులు

తిరుపతి అర్బన్ జిల్లాలో ద్విచక్ర వాహన దారులు హేల్మట్ వాడకం తప్పనిసరి చేస్తూ జిల్లా యస్.పి డా. గజరావు భూపాల్   ఇదివరకే పత్రికా ముఖంగానే కాకుండా హేల్మట్ అవగాహన, ర్యాలీలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించి ప్రజలకు అవగాహన కలిపించడం జరిగింది. ఇందులో భాగంగా  గురువారం  నుండి జిల్లాలో ద్విచక్ర వాహన దారులు హేల్మట్ వాడకం తప్పనిసరి చేస్తూ ప్రకటన జారీచేయడం జరిగింది. ఈ సందర్బంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రామచంద్ర పుష్కరణి రోడ్ కూడలి వద్ద జిల్లా య.పి గారు హేల్మట్ లేని ద్విచక్ర వాహనాలను సిబ్బందితో కలిసి ఆపి కౌన్సిలింగ్  ఇవ్వడంతో పాటు అలాగే హేల్మట్ లేని వాహనాలకు ఇ-చల్లాన్ వేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 929 ఇ-చల్లాన్ వేయడం జరిగింది. ఫైన్ అమౌంట్ మొత్తం రూ. 92,900/-. ఈ సందర్బంగా స్పెషల్ డ్రైవ్ నందు ట్రాఫిక్ డి.యస్.పి ముస్తఫా, వెస్ట్ డి.యస్.పి నరసప్ప, సి.ఐ.లు ట్రాఫిక్ సురేష్ కుమార్, వెస్ట్ శివప్రసాద్, యస్.ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని