యూనిట్
Flash News
ఉత్తమ సేవలందించిన మొబైల్ టీమ్ సిబ్బందిని అభినందించిన తిరుపతి ఎస్పీ
సమయం రాత్రి 10:40 నిమిషములు, కోయంబత్తూరు నుండి
శ్రీ వారి దర్శనార్థం తిరుమలకు వచ్చుచున్న ఒక కుటుబం ప్రయాణిస్తున్న కారు అనుకోనివిదంగా
శ్రీ కాళహస్తి హైవే పాత స్వర్ణముఖి నది బ్రిడ్జి పై వచ్చుచుండా గా కారు
రెండు టైర్లు ఒక్కసారిగా పగిలిపోయాయి. దిక్కు తోచని స్థితిలో వారు ఉండగా అదే సమయంలో శ్రీ కాళహస్తి హైవే
మొబైల్ పోలీస్ వాహనము డ్యూటీ సిబ్బంది HC కే.శ్రీదర్ బాబు, HG కే.అబ్రహం అటువైపు
వస్తూ.. వీరి పరిస్థితిని గమనించిన వెంటనే స్పందించి "మేమున్నాము.
మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీకు అన్ని సహాయక ఏర్పాట్లు చేస్తామని" వారికి
ధైర్యం చెప్పి ముందుగా వారికి కావలసిన ఆహార పానీయాలను ఏర్పాటు చేసి, తదుపరి దగ్గరుండి పంక్చర్ వేయు షాప్ వారిని రప్పించి వారికి
కావలసిన అన్ని ఏర్పాట్లను చేసినారు. వాహనము పూర్తిగా రిపేర్ కావడానికి సుమారు ఆర్దరాత్రి 2 గంటలు అయినది. అంతవరకు దగ్గరుండి సహాయసహకారాలు అందించిన
పోలీస్ వారికి ఆ కుటుంబ సభ్యులు ప్రత్యేక అబినందనలు తెలపడమే కాకుండా, క్షేమంగా కోయంబత్తూరు చేరిన తరువాత పోలీస్ యొక్క సేవలను కొనియాడుతూ అర్బన్ జిల్లా
యస్.పి డా. గజరావు భూపాల్ కి ఉత్తరం
ద్వారా జరిగిన సంఘటన తెలియపరిచి సహాయం చేసిన ఆ ఇద్దరి పోలీస్ వారినే కాకుండా
జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక అబినందనలు తెలిపారు. వీరి సేవలను గుర్తించిన
జిల్లా యస్.పి ప్రత్యేకంగా జిల్లా పోలీస్
అధికారుల క్రైమ్ మీటింగ్ నందు వీరు
ఇరువరిని అభినందించి రివార్డ్ ఇచ్చి సత్కరించారు.