యూనిట్

మాజీ మంత్రి జే.సి. దివాకర్ రెడ్డి మాటలు అన్యాయమైనవి

అనంతపురం నందు మాజీ మంత్రి జే.సి. దివాకర్ రెడ్డి,   మాజీ  ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు   సమక్షంలో పబ్లిక్ మీటింగ్ నందు మాట్లాడుతూ తాము అధికారములోకి వస్తే పోలీసులను బూట్లు నాకిస్తామని అనడం దుర్మార్గమని తిరుపతి పోలిసుల అధికారుల సంఘం అధ్యక్షుడు  ఎం సోమశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ  పోలీసులపై గంజాయి కేసులు పెట్టిస్తామని చేసిన వ్యాక్యలు చాలా నీచమైనవన్నారు.  ఈ మాటలను  తిరుపతి పోలిసుల అధికారుల సంఘము తీవ్రముగా ఖండిస్తుందన్నారు. . రాజ్యాంగబద్దమైన ఎమ్మెల్యే, మంత్రి  పదవులను అనుబవించి సుదీర్గకాలము పోలిసుల సేవలను పొంది ఇప్పుడు ఈ విధముగా  మాట్లాడడం పద్దతి కాదు అన్నారు.  జే.సి. దివాకర్ రెడ్డిపై వెంటనే చర్య తీసుకోని మీ విజ్ఞతను నిరూపించుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్బముగా తెలియపరుస్తన్నామన్నారు.  ఆయనతో పటు కె. చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీ, జి. శంకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ, ఎం. కామరాజు, కోశాధికారి,  జ్యోతినాథ్, మెంబెర్ తదితరులు పాల్గొన్నారు. 

వార్తావాహిని