యూనిట్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ బందోబస్తు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా బందోబస్తుకు వచ్చిన అధికారులు మరియు సిబ్బందికి తిరుమల PAC-III ప్రాంగణము నందు అర్బన్ జిల్లా యస్.పి డా.గజరావు భూపాల్ ఐ.పి.యస్ గారు పలు సూచనలు జారీ చేసారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ   తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైనదని, ముఖ్యంగా యాత్రికులు ఇక్కడకి పరిసర ప్రాంతాల నుండే  కాకుండా ఇతర  రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి, వారికి ఇక్కడ కొత్తగా ఉంటుందాని, మనం వారికి సహాయకారిగా ఉండాలన్నారు. ఇక్కడ డ్యూటీ చేయువారు, డ్యూటీ అనే బావంతో కాకుండా దేవునికి సేవ చేస్తున్నామనే భావంతో పని చేయాలని సూచించారు.  భక్తులతో ప్రేమగా, మర్యాదకపూర్వంగా ప్రవర్తించి వారు సహనం కోల్పోయినా  మనం ఎట్టి పరిస్థితిలోను సహనం కోల్పోకుండా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ వైకుంఠ ఏకాదశిలో ఏ ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి ఆటంకము కలగకుండా చూసుకొనే భాద్యతలు మన తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ వారిపై ఉందని, అలాగే ఇక్కడికి డ్యూటీ చేయడానికి వచ్చిన వారు కూడా క్రమశిక్షణతో డ్యూటీ చేసి పోలీసులకు మంచి పేరు తేవాలని చెప్పారు. క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఎవరు కూడా క్రమశిక్షణని ఉల్లంఘించరాదని, డ్యూటీ విషయంలో తాను  కఠినంగా ఉంటానని హెచ్చరించారు. అలాగే ఈ వైకుంఠ ఏకాదశిలో మనతో పాటు టి.టి.డి వారు మరియు ఇతర శాఖల అధికారులు కూడా పనిచేస్తూ ఉంటారని,వారితో సమన్వయము ఏర్పరుచుకొని పనిచేయాలన్నారు. మనవల్ల మనతోపాటు ఉండే వారికి మరియు భక్తులు  ఎలాంటి ఇబ్బంది కలుగరాదన్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి  కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసారు.అదే విధంగా  భక్తులు కూడా  సమన్వయంతో సహనం పాటించి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులలో ప్రశాంతంగా భక్తులు శ్రీవారిని దర్శించుకొని పునీతులు కావాలని,  ముఖ్యంగా భక్తులు తమ విలువైన ఆభరణాలను భద్రంగా చూసుకోవాలని మరియు  తమతో పాటు వచ్చిన పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేసారు.

ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశికి  అడిషనల్ యస్. పి లు – 04, డి.యస్.పి లు – 34, సి.ఐలు - 71, యస్. ఐ. లు – 174, ASI/హెడ్ కానిస్టేబుల్ – 434,  కానిస్టేబుల్స్ – 952,  మహిళా కానిస్టేబుల్స్ – 123, హోం గార్డ్స్ – 423, స్పెషల్ పార్టీ – 34 టీమ్స్,  మొత్తము – 2215 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమైనది.

వార్తావాహిని