యూనిట్

ముగ్గురు మావోయిస్టులు లొంగుబాటు

మావోయిస్టు పార్టీలో చురుకుగా పని చేసే ముగ్గురు మావోయిస్టు సభ్యులు విశాఖపట్నం రేంజ్‌ డి.ఐ.జి ఎల్‌.కాళిదాస్‌ వెంకటరంగారావు సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భముగా డిఐజి మాట్లాడుతూ పార్టీ భావాలు నచ్చక, కుటుంబ సభ్యులతో గడపాలనే ఉద్ధేశ్యంతో జనజీవన శ్రవంతిలో కల్సిపోయినట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో బోడ అంజయ్య అలియాస్‌ భాస్కర్‌ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పెద్దరాసపల్లి మండలానికి చెందిన వాడు. 2004 నుండి ఈస్ట్‌ డివిజన్‌ ఏరియా దళం సభ్యునిగా, ఏసీఎంగా పనిచేసి ప్రస్తుతం డీసీఎంగా వున్నాడు. ఇతని పై ఆరులక్షల రూపాయల రివార్డు వుందన్నారు. కొర్రా వెంకటరావు అలియాస్‌ శ్రీకాంత్‌ది కొయ్యూరు మండలం కన్నవరం గ్రామం. టెక్నికల్‌ టీంలో ఏసీఎంగా ఉన్నాడు. ఇతని పై నాలుగు లక్షల రూపాయలు రివార్డు వుంది. మిలిషియా దళ సభ్యుడిగా చేరి ఏసిఎం వరకు ఎదిగాడు. సీంద్రి కాంద్రి అలియాస్‌ జీవని, జ్యోతి, సావిత్రిది కొయ్యూరు మండలం గొర్లమెట్ట గ్రామం. జీవిని 2013 నుండి 2019 వరకు మిలిషియా దళ సభ్యురాలిగా వ్యవహరించింది. ఈమె పై నాలుగు లక్షల రివార్డు వుంది. కార్యక్రమంలో విశాఖపట్నం రూరల్‌ ఎస్పీ అట్టాడ బాబూజీ, ఒఎస్‌డి బి.కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని