యూనిట్

తిరుమలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ముగ్గురు అరెస్టు

తిరుమలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ముగ్గురు అరెస్టు తిరుమలలో అన్యమత మందిరాలు వెలిశాయని సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు తిరుపతి అర్భన్‌ ఎస్పీ కే.కే.అన్బురాజన్‌ తెలిపారు. కేసు వివరాలను ఆయన వెల్లడించారు. కాటేపల్లి అరుణ్‌ అనే వ్యక్తి తిరుమల కొండపై అన్యమత మందిరాలు వెలసినట్లు సోషల్‌ మీడియాలో పోస్టు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లు టిటిడి విజిలెన్స్‌ విబాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన కాటేపల్లి అరుణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఓ వాట్సప్‌ గ్రూప్‌లో గరికపాటి కార్తీక్‌ పోస్ట్‌ చేయగా దాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేసినట్లు తెలిపాడు. ఈ ఫోటోను గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన మిక్కిలినేని సాయి అజితేశ్‌ చక్రవర్తి మార్పింగ్‌ చేసిన ఫోటోలను పోస్టు చేసినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు కాటేపల్లి అరుణ్‌, గరికపాటి కార్తీక్‌ మరియు మిక్కిలినేని సాయి అజితేశ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

వార్తావాహిని