యూనిట్

పోలీసులను మీ కుటుంబ సభ్యులుగా భావించాలి: తిరుపతి ఎస్పీ

పోలీస్ స్టేషన్ ను మీ ఇల్లుగా, పోలీసులను మీ కుటుంబ సభ్యులుగా భావించి, మహిళలు సమస్యలను తెలియపరచడానికి ముందుకు రావాలని తిరుపతి అర్బన్ ఎస్పీ డా.గజరావు భూపాల్ అన్నారు. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ ఆడిటోరియం నందు నిర్వహించిన  మహిళ మిత్ర వాలాంటీర్స్ తో, స్వచ్చంద సంస్థ మరియు ఎన్. జి. ఓ లతో మహిళా మిత్ర కో-ఆర్డినెషన్  సమావేశం లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా అయన  మాట్లాడుతూ సమాజంలోని వివిధ రకాల మహిళలు గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.  వీరు తమ మనసులోనే మదనపడుతూ బయటికి చెప్పుకోలేక ఆవేదన చెందుతుంటారని ఇలాంటివారినే కాకుండా సమాజంలో  ఎన్నో సమస్యలను   ఎదుర్కొంటున్నారన్నారు.  వీటిని దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.  ఈ చట్టంలో వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి 21 పని దినాల్లో శిక్ష కూడా పడేవిధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  దిశ చట్టంలో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని, దేశంలో ఇలాంటి చట్టం ఇదే మొదటిసారి అని ఇందులో భాగంగానే, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో దిశ పోలిస్ స్టేషన్ లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు.  తిరుపతి అర్బన్ జిల్లలో కూడా ఇప్పటికే దిశ పోలిస్ స్టేషన్ కు అనువైన ప్రాంతాన్ని పరిశీలించామన్నారు.  ఈ సమావేశానికి జిల్లాలోని డి.యస్.పి లు ఈస్ట్ మురళి కృష్ణ,  వెస్ట్ నరసప్ప, మహిళా వెంకటేశ్వర్లు, సి.ఐ లు అంజు యాదవ్, పద్మలత, మహిళా సిబ్బంది, మరియు ఎన్. జి. ఓ ల అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని