యూనిట్

ప్రపంచ స్థాయి ప్రదర్శనగా భావిస్తున్నా: డీజీపీ

స్వాట్‌ (స్పెషల్‌ వెపన్స్‌ అండ్‌ టాక్టిక్స్‌) టీం ప్రదర్శన ప్రపంచ స్థాయి ప్రదర్శనగా భావిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ శ్రీ డి.గౌతమ్‌ సవాంగ్‌ గారు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన ప్రకాశం స్వాట్‌ టీం ప్రదర్శనను జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ల సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ అన్ని యూనిట్లలో స్వాట్‌ టీంలు అవసరమని భావించామని, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆసక్తి చూపడంతో మొదటిగా ప్రాధాన్యత ఇచ్చామన్నారు. స్వాట్‌ టీం ప్రదర్శన ద్వారా ఏపీి పోలీసుల ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పగలిగామన్నారు. మూడు నెలల కాల వ్యవధిలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిగారి ఆశయానికి అనుగుణంగా సుశిక్షితులైన బృందాన్ని తయారు చేసిన జిల్లా ఎస్పీకి అభినందనలు తెలిపారు. శిక్షణ ఇచ్చిన ఆక్టోపస్‌ శిక్షకులు ఎ.పాపారావు, ఎన్‌.శ్రీనివాసులను అభినందించారు. ప్రదర్శనలో కిడ్నాప్‌కు గురైన వీ.ఐ.పీలను సురక్షితంగా బయటకు తీరుకురావడం, హైజాక్‌ అయిన ప్రయాణీకకుల వాహనాలను అడ్డుకుని ముష్కరులను అదుపులోకి తీసుకోవల్సిన సందర్భాల్లో ఎలాంటి నైపుణ్యం, దూకుడు ప్రదర్శిస్తారో టీం సభ్యులు చూపించారు. 

వార్తావాహిని