యూనిట్
Flash News
డెయిరీలో చోరికి పాల్పడ్డ దొంగ అరెస్టు
గుంటూరు
జిల్లా చేబ్రోలు సంగం డెయిరీలో జరిగిన దొంగతనాన్ని చేబ్రోలు పోలీసులు ఛేదించారు.
నిందితుడు అనిల్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు సౌత్ డిఎస్పీ కమలాకర్ తెలిపారు.
కేసు వివరాలను ఆయన వెల్లడించారు. సంగం డెయిరీలోని క్యాషియర్ రూమ్ తాళాలు, అందులోని బీరువాను పగలగొట్టి రూ.44 లక్షల 43వేల 540
నగదును దొంగలించినట్టుల క్యాషియర్ మన్నెం గోపి శ్రీనివాస రావు ఇచ్చిన ఫిర్యాదు
మేరకు దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు. చేబ్రోలు సి.ఐ శ్రీనివాసరావు, ఎస్సై కిషోర్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంను రప్పించి
ఆధారాలను సేకరించారు. క్లూస్ టీం సేకరించిన ఆధారలతో నిందితుడైన అనిల్ కుమార్‌ను
అరెస్ట్ చేసి అతని వద్ద నుండి రూ.44 లక్షల 43వేల 540 నగదును స్వాధీనం చేసుకున్నారు.