యూనిట్
Flash News
దేశ రక్షణలో ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకోవాలి
దేశ
రక్షణలో ప్రానాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకుని అమరవీరుల వారోత్సవాలు
జరుపుకోవాలని కడప జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అన్నారు. జిల్లా పోలీస్
కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి ముఖ్య
అతిధిగా హజరై మాట్లాడారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలను వారంరోజుల పాటు
నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు వాడే ఆయుధాలు, దుస్తులు, పనిముట్లు,
నేర దర్యాప్తు విధానం, పోలీసుల విధులు,
పోలీస్టేషన్లలో ఏం జరుగుతుంది, ఫిర్యాదులపై
ఎలా చర్యలు తీసుకుంటారనే విషయాలపై విద్యార్ధులకు, ప్రజలకు
అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్‌లో పోలీస్ అయుధాలు
ఏకే 47, 9 ఎంఎం గ్లాస్ పిస్టల్, 303 ఎల్‌ఎంజి, 7.62 ఎంఎఎల్‌ఎస్‌ఆర్, జీఎఫ్ రైఫిల్ ఫెడరల్ గ్యాస్ గన్ ట్రంబెన్ పిస్టల్, రియల్ పిస్టల్ మరియు ఇతర ఆయుధాల పనితీరును వివిరించారు.