యూనిట్
Flash News
సంక్షేమంలో నవశకం...
విజయవాడ
ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 73వ
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు
హాజరై జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు గడిచినా ఇప్పటికి బడుగు, బలహీన
వర్గాలకు సంక్షేమ ఫలాలు అందడం గగనంగా ఉందని, అందుకే
వ్యవస్థను సమూలంగా మార్చి ప్రతి పేదకు సంక్షేమ పథకాలను చేరువచేయడమే తమ ప్రభుత్వ
లక్ష్యంగా చేసుకున్నామన్నారు. అభివద్ధి, సంక్షేమ ఫలాలను
బడుగు, బలహీన వర్గాలకు చేరకుండా అడ్డుకుంటున్న దళారి
వ్యవస్థను నిర్వీర్యం చేసి అవినీతి రహిత పాలన అందిస్తామని స్పష్టం చేశారు. 45 ఏళ్ళు దాటిన ఎస్సీ,ఎస్టీ, బిసీ, మైనారిటీ మహిళల కుటుంబాలకు ఆయా
కార్పొరేషన్‌ల ద్వారా రూ. 75,000 సాయాన్ని అందించే
పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాఖీ పండుగ సందర్భంగా డ్వాక్రా మహిళలకు
మొత్తంగా రూ. 27,417 కోట్లను నాలుగు విడతలుగా, వారిపై ఎటువంటి వడ్డీ పడని విధంగా వారి చేతికే అందజేస్తామని హామీ
ఇచ్చారు. రాష్ట్ర విభజన వలన, గత ప్రభుత్వ పాలనా విధానాల
వలన జరిగిన నష్టాలను వేగంగా సవరించుకుంటూ, స్పష్టమైన
విధానంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. గోదావరి జలాలను నాగార్జున సాగర్,
శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించడం ద్వారా కష్ణా ఆయకట్టుకు నీటిని
అందిస్తామన్నారు. అక్టోబర్ 15 నుండి రైతు కుటుంబాలకు
వ్యవసాయ సాయం నిమిత్తం ఏడాదికి రూ. 12,500లు
అందించనున్నట్టు వెల్లడించారు. రైతులకు, పేదలకు ఉచిత
విద్యుత్ అందించే లక్ష్యంతో విద్యుత్ సంస్థలను రేట్లు సవరించమని చెప్పామని,
దీన్ని కూడా ప్రతిపక్షం రాజకీయం చేస్తుందని విమర్శించారు. గ్రామ
వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థల ద్వారా సుమారు నాలుగు లక్షల
ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, నిరాశలో ఉన్న లక్షలాది
మంది నిరుద్యోగులకు ఇది అమూల్య వరమని అన్నారు. జనవరి 26
నుండి ''అమ్మ ఒడి'' పథకం
ప్రారంభిస్తామని, పాఠశాలల రూపు రేఖలు కూడా సమూలంగా
మార్చివేస్తామన్నారు. పేదలందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ''ఆరోగ్య భద్రతా'' కల్పించడమే కాకుండా
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిని కార్పొరేట్ హాస్పిటల్స్‌గా
తీర్చిదిత్తుతామన్నారు. ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని తొలగించి పాత పెన్షన్
పద్దతి అమలుకు ప్రక్రియ జరుగుతుందన్నారు. డిజిపి శ్రీ డి. గౌతమ్ సవాంగ్ గారు
అనుసరించగా ప్రత్యేక వాహనంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు
సాయుధ పోలీస్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. గతంలో కేంద్ర హోమ్ శాఖ
ప్రకటించిన ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, పోలీస్ మెడల్
గ్యాలంటరీలను సంబంధిత గ్రహీతలకు అందజేశారు.విధి నిర్వహణలో అమరుడైన గ్రేహోండ్స్
సీనియర్ కమెండో అబూబకర్ తండ్రి ఎం.డి. అబూబకర్ పతకం స్వీకరించగా, జీవనరక్ష పతకాన్ని నిమ్మల వీరవెంకట రమణ అందుకున్నారు. వివిధ ప్రభుత్వ
శాఖలు రూపొందించి ప్రదర్శించిన ప్రత్యేక శకటాలు అందరిని ఆకట్టుకున్నాయి. సెర్ప్,
ఎక్సయిజ్, వ్యవసాయ శాఖల శకటాలు ప్రథమ,ద్వితీయ, తతీయ బహుమతులను కైవసం చేసుకున్నాయి.
పోలీస్ పెరేడ్ లో 16 వ బెటాలియన్ (విశాఖపట్నం) ప్రథమ,
3వ (కాకినాడ) బెటాలియన్ ద్వితీయ బహుమతులను అందుకున్నాయి.
కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం తోపాటుగా
ముఖ్యమంత్రి గారి మాత మూర్తి శ్రీమతి వైఎస్ విజయమ్మ, మంత్రులు
ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.