యూనిట్
Flash News
సాంకేతిక విజ్ఞానం వినియోగం మితిమీరి మనిషి భవితకు సవాలుగా మారాయి: హోంమంత్రిగారు
సాంకేతిక విజ్ఞానం
వినియోగం మితిమీరి మనిషి భవితకు సవాలుగా మారాయి: హోంమంత్రిగారు నేడు సాంకేతిక విజ్ఞానం,
స్మార్ట్‌ఫోన్ల వినియోగం మితిమీరి మనిషి భవితకు సవాలుగా మారాయని రాష్ట్ర హోంమంత్రి
శ్రీమతి మేకతోటి సుచరిత గారు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రంగరాయమెడికల్
కళాశాలలో 'ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్' పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య
అతిధిగా హాజరై మాట్లాడారు. సైబర్ నేరాల నుంచి మహిళలను కాపాడేందుకు, రాష్ట్రాన్ని అభయ్
ఆంధ్రప్రదేశ్‌గా రూపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి
గారు కృషి చేస్తున్నారని తెలిపారు. సైబర్ మిత్ర, మహిళా మిత్రలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా
విద్యాసంస్థలలో ప్రత్యేక సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లను
పట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 100, 112. 181, వాట్సప్ నంబర్ 9121211100లను ఏర్పాటు
చేసిందన్నారు. మహిళలకు, విద్యార్ధినులకు ఏమైనా సమస్యలు ఎదురైతే హెల్ప్‌లైన్ నెంబర్లకు
సమాచారం అందించి సహాయం పొందవచ్చన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా శిశుసంక్షేమశాఖామంత్రి
శ్రీమతి టి. వనిత గారు మాట్లాడుతూ సెల్‌ఫోన్లు వచ్చాక కుటుంబ వ్యవస్థలో అనుబంధాలు తగ్గిపోతున్నాయని
పేర్కొన్నారు. అనంతరం అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు, మాట్లాడుతూ మహిళా మిత్ర,
సైబర్ మిత్ర వలన మహిళలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు. కార్యక్రమంలో అరకు ఎంపీ శ్రీమతి మాధవి
గారు, కాకినాడ ఎంపీ శ్రీమతి వంగా గీత గారు, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జిల్లా
ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తదితరులు పాల్గొన్నారు.