యూనిట్
Flash News
విద్యార్ధి దశనుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలి
విద్యార్ధి దశనుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలి విద్యార్ధులు ఈ దశనుండే క్రమశిక్షణ అలవర్చుకోవాల్సిన అవసరం వుందని కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి అన్నారు. కడప నగర శివార్లలోని రిమ్స్‌లో వైద్య, దంద వైద్య, నర్సింగ్ కళాశాలల విద్యార్దులకు 'ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ నివారణ'పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్ధులు తమ జీవితంలో గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దైనందిన జీవితంలో ఎంతటి ఒత్తిళ్లు, కష్టాలు ఎదురైనా ఎదుర్కొని పోరాడాలని సూచించారు. విద్యాదికులే సైబర్ నేరాల బారిన పడి భారీగా ఆస్తినష్టాలను కలుగజేసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో రిమ్స్ ప్రిన్సిపాల్ వివిఎంవి ప్రసాద్‌రావు, సూపరెంటెండెంట్ డాక్టర్ టి.గిరిధర్, ఆర్.ఎం.ఓ డాక్టర్ జంగం వెంకటశివ, తదితరులు పాల్గొన్నారు.