యూనిట్

నూతన సంప్రదాయానికి తేరా తీసిన ఎస్పీ

నూతన సంవత్సరం సందర్భముగా ప్రకాశం జిల్లా ఎస్పీ సిధార్థ కౌశల్ నూతన సంప్రదాయానికి తెర తీశారు. జిల్లా లో పని చేసే అన్ని విభాగాలలో ఎస్సై ఆపై స్థాయి అధికారులందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు. అందరూ కూడా గెలుపు ఓటములలో కలిసి కట్టుగా పనిచేసి, పోలీస్ శాఖకు తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావలెను అనే ఉద్దేశం తో ఫోటో దిగినారు. పై ఫోటో అన్ని పోలీస్ కార్యాలయాల లోను ఉంచాలని సూచించారు. పై ఫోటో వలన అందరికి టీం స్పిరిట్, టీం వర్క్ అలవడుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. 

వార్తావాహిని