యూనిట్
Flash News
అమరుల సేవలు మరువలేనివి

పోలీసు
అమరవీరుల సేవలు మరువలేనివని డిఐజి, 6వ పటాలము ఇన్‌చార్జి కమాండెంట్ విజయ్‌కుమార్ అన్నారు. అమరవీరుల
సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముందుగా స్థూపానికి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు
అర్పించారు. విధినిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సేవలు ఎన్నటికీ
గుర్తుంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వీరమరణం పొందిన అమరవీరుల పుస్తకాన్ని డిఐజి
చేతులమీదుగా ఆవిష్కరించారు. వారిపేర్లను చదివి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో
అడిషనల్ కమాండెంట్ ఈఎస్ సాయిప్రసాద్, అసిస్టెంట్
కమాండెంట్ శ్రీనివాసబాబ్జి, పటాలము అధికారులు, సిబ్బంది అమరవీరులకు నివాళులు అర్పించి, గౌరవ
వందనం చేశారు.