యూనిట్

హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి

హోంగార్డుల సేవలు వెలకట్టలేనివని కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాధ్‌ బాబు అన్నారు. హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన పరేడ్‌కు ముఖ్య అతిధిగా హాజరైనారు. ముందుగా పరేడ్‌ కమాండర్‌ చంద్రశేఖర్‌ రావుచే గౌరవ వందనం స్వీకరించి పరేడ్‌ను తిలకించారు. అనంతరం మాట్లాడుతూ  పోలీస్‌ విధినిర్వహణలో హోంగార్డుల పాత్ర ఎంతో కీలమైనవనివీరు పోలీస్‌ కానిస్టేబుల్స్‌తో పాటు సమానంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.

జిల్లా వ్యాప్తంగా 560 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారని వీరికి ఇళ్ళుఇళ్ల స్థలాలు మంజూరు చేయమని జిల్లా కలెక్టర్‌కు వినతులు అందజేశామనిఉగాది నాటికి అర్హులైన హోంగార్డులకు ఇళ్ళపట్టాలు మంజూరు కానున్నవని తెలిపారు. అనంతరం పలు క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన హోంగార్డులకు బహుమతులను అందజేసారు. అనంతరం హోంగార్డులు లక్ష్మీటాకీస్‌ మీదుగా జిల్లా కోర్టు సెంటర్‌ వరకు నిర్వహించిన మార్చ్‌పోస్ట్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సత్తిబాబుడిఎస్పీలు ఉమామహేశ్వర రావుమెహబూబ్‌ బాషావెంకటేశ్వర్లుసత్యనారాయణతదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని