యూనిట్

స్పందనకు విశేష ఆదరణ

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి స్పందన కార్యక్రమం నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి, వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సబ్‌ డివిజన్‌ల నుండి ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయా స్ధానిక పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో లైవ్‌ వీడియో స్ట్రీమింగ్‌ ద్వారా ఎస్పీ మాట్లాడి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసుస్టేషన్‌ అధికారులను ఆదేశించారు. నా బాగోగులను నా కుమారులు గోపాల్‌ రెడ్డి (హాస్పిటల్‌ డాక్టర్‌), శేఖర్‌ రెడ్డి(ఇంజనీర్‌)లు చూడడం లేదని, నా బాగోగులను ఏవరైనా ఒకరు చూసేవిధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. కర్నూలులోని కె.పి వెంకటరెడ్డి కాలనీలో ఉన్న మా ప్లాట్‌ను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని వారిపై చర్యలు తీసుకొని మా ప్లాట్‌ మాకు ఇప్పించాలని కర్నూలు మద్దూర్‌ నగర్‌ కు చెందిన శివనాగమ్మ ఫిర్యాదు చేశారు. ఇలా పొలం, ఉద్యోగం ఇప్పిస్తామనని మోసం చేశాడని, పరిశుభ్రతపై, కుమారులపై తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువు లోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ శ్రీమతి దీపికా పాటిల్‌, డీిఎస్పీ డి.వి రమణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని