యూనిట్

ర్యాగింగ్‌ భూతాన్ని తరిమి కొట్టాలి

ర్యాగింగ్‌ భూతాన్ని తరిమి కొట్టాలి ప్రస్తుతం విద్యార్థులను పట్టిపీడిస్తున్న భూతం ర్యాగింగ్‌, దీనిని తరిమికొట్టాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌.పి. నవదీప్‌ సింగ్‌ గ్రేవల్‌ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని నిట్‌ విద్యార్థులతో ఎస్‌.పి. ప్రత్యేకంగా సమావేశమై ర్యాగింగ్‌ వల్ల జరిగే అనర్థాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యక్షంగా విద్యార్థులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్‌.పి. మాట్లాడుతూ ర్యాగింగ్‌ వల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారమై, క్రిమినల్‌ కేసులకు గురై, బంగారు భవిష్యత్‌ను పాడుచేసుకుంటున్నారన్నారు. విద్యాసంస్థల్లో నిషేధించబడిన ర్యాగింగ్‌కు పాల్పడితే యాంటీ ర్యాంగింగ్‌ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యాభ్యాసం మంచిగా సాగించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఈ సందర్భంగా పలు విషయాలపై సమస్యలను ఎస్‌.పి.తో విన్నవించారు.

వార్తావాహిని