యూనిట్

రాష్ట్ర పోలీస్‌ల పనితీరుపై ప్రధాని ప్రశంసలు

గుజరాత్‌ వడోదరలో ఏర్పాటు చేసిన పోలీస్‌ టెక్నికల్‌ ఎగ్జిబిషన్‌లో  ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ స్టాల్‌ను సందర్శించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ  ఏపీ పోలీస్‌ పనితీరును ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ స్టాల్‌నందు స్పందన, వీక్లీ ఆఫ్‌ సిస్టమ్‌, ఫింగర్‌ ఐడెంటిఫికేషన్‌, షేస్‌ రికగ్నేషన్‌, ఈ విజిట్‌, డిజి డాష్‌బోర్డ్‌, లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ తదితర విధానాలను వివరిస్తూ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ స్టాల్‌ను సందర్శించిన ప్రధాని రాష్ట్రంలో అమలు జరుగుతున్న విధానాల గురించి ఆసక్తిగా అడిగి, వాటి గురించి సావధానంగా తెలుసుకున్నారు. స్పందన, వీక్లీ ఆఫ్‌ విధానాల పనితీరును ప్రత్యేకంగా అభినందించి, వాటికి సంబంధించిన పూర్తి విధివిధానాల వివరాలు వారికి అందజేయవలసినదిగా అక్కడి అధికారులను కోరారు. రాష్ట్ర పోలీస్‌ శాఖ సాంకేతికత పరంగా, నైపుణ్యతాపరంగా ఎల్లప్పుడూ ముందంజలో వుంటుందనడానికి ఇది ఒక మంచి తార్కాణంగా నిలుస్తుందన్నారు. సాంకేతికత వర్క్‌షాప్‌లో పాల్గొన్న డిఐజి జి.పాలరాజు గౌరవ ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న పోలీసు పనితీరు, సాంకేతికత సాయంతో పోలీసు చేస్తున్న 12 రకాల సేవలను వివరించారు. వీటిలో విశాఖ రూరల్‌ పోలీసుల ఈ-విజిటింగ్‌, ఫిన్స్‌ పనితీరు, ఇంటి దొంగతనాలను అరికట్టేందుకు ఏపీ పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ప్రకాశం జిల్లా ఎస్‌.పి. నూతనంగా ఆవిష్కరించిన వర్చువల్‌ పోలీసింగ్‌ సిస్టమ్‌ (వీడియో కాన్ఫరెన్స్‌), అనంతపురం పోలీసులు నేరగాళ్ళను పట్టుకునేందుకు ఉపయోగించే సర్వేలెన్స్‌ కెమెరాలు, విజయవాడ నగర పోలీస్‌ డాష్‌బోర్డ్‌, అలాగే విజిటర్స్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ఫ్యూయెల్‌ అండ్‌ ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పనితీరును వివరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పోలీసులకు అమలయ్యేలా వారాంతపు (వీక్లీఆఫ్‌) సెలవు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్న 'స్పందన' మొబైల్‌ అప్లికేషన్‌, న్యూస్‌ వాచ్‌లను, విజయవాడ సిటీ పోలీసుల కోర్టుమానిటరింగ్‌ సిస్టమ్‌ల పనితీరును కూడా గౌరవ ప్రధానమంత్రికి డిఐజి జి.పాలరాజు వివరించారు. ఈ టీమ్‌లో నోడల్‌ అధికారిగా ఏఐజి ఎస్‌.వి. రాజశేఖర్‌బాబు, స్టాల్‌ ఇన్‌చార్జిగా డిఎస్‌పి టి.పి.విఠలేశ్వర్‌, డిఎస్‌పి పి.మహేష్‌, ఎస్‌.ఐ.లు కె.విజయకుమార్‌, జి.రవికిరణ్‌, ఆర్‌.ఎస్‌.ఐ. ఎం.సురేష్‌ కుమార్‌, ఎస్‌.ఐ. కుమార స్వామి, ఎస్‌.ఐ. మహేష్‌, ఆర్‌.ఎస్‌.ఐ. సి.జె.భరత్‌, ఆర్‌.ఎస్‌.ఐ. ఎం.డి.సాథిక్‌, హెచ్‌సి శ్రీధర్‌ తదితరులు ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. 


వార్తావాహిని