యూనిట్

ప్రజలు శాంతియుతంగా ఉండాలంటే పోలీసులకు త్యాగాలు తప్పవు

ప్రజలు శాంతియుతంగా జీవించాలంటే పోలీసులు త్యాగాలు చేయక తప్పదు అని విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి అన్నారు. ఉద్యోగ విరమణ చెందిన ఎస్సై సుమల సింహాచలం నాయుడు, ఎ.ఆర్‌.హెచ్‌.సి మహంతి అప్పలస్వామిలకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు మఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సుమారు 40 సంవత్సరాలు ఎంతో క్రమశిక్షణతో విశిష్టమైన సేవలందించిన పోలీసు ఉద్యోగుల నిబద్దతను ఆమె కొనియాడారు. సుదీర్ఘ సర్వీసులో ఒక్క క్రమశిక్షణ చర్య కూడా లేకుండా విధులు నిర్వర్తించినందుకు మీరు మిగిలిని సిబ్బందికి ఆదర్శనీయులన్నారు. కార్యక్రమంలో ఎస్బీ డిఎస్పీ సి.ఎం.నాయుడు, ఎ.ఆర్‌.డిఎస్పీ ఎల్‌.శేషాత్రి తదితురలు పాల్గొన్నారు.

వార్తావాహిని