యూనిట్

గిరిపుత్రులకు విహారయాత్ర ఏర్పాటు చేసిన పోలీసు శాఖ

గిరిపుత్రులకు విహారయాత్ర ఏర్పాటు చేసిన పోలీసు శాఖ 'గిరిపుత్రుల ముందడుగు' కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్ధులను మూడురోజలపాటు విశాఖపట్నం నగరంలో విజ్ఞాన విహార యాత్ర ఏర్పాటు చేసారు. సందర్శనీయ ప్రదేశాలైన విశాఖపట్నం పోర్టు ట్రస్టు, బీచ్‌రోడ్డులోగల ఎయిర్‌ క్రాప్ట్‌ మ్యూజియమ్‌, కురసుర సబ్‌మెరైన్‌, రామకృష్ణా బీచ్‌, మత్స్యదర్శిని, కైలాసగిరి, ఆంధ్రవిశ్వవిద్యాలయంలోని జువాలజీ విభాగం, లైబ్రరీలను వీక్షించారు. చివరి రోజు సింహాచలం దైవ దర్శనం, జిల్లా పోలీస్‌ కార్యాలయం, సి.ఎమ్‌.ఆర్‌ షాపింగ్‌ మాల్‌లో సినిమాలను చూపించారు. చివరగా కైలాసగిరి రిజర్వు మైదానంలో ముగింపు సమావేశం నిర్వహించి విద్యార్దులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ మాట్లాడారు. విజ్ఞానాన్ని సముపార్జించాలంటే ఇష్టపడి చదవాలన్నారు. ఉన్నత చదువులు చదువుకుని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కోరిక, సంకల్పం మీలో గట్టిగా వుండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని