యూనిట్

గిరిజనులకు పోలీస్‌ శాఖ అండగా నిలుస్తుంది

గిరిజనులకు పోలీశ్‌ శాఖ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని విశాఖపట్నం జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజి అన్నారు. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయితీ వాకపల్లి గ్రామంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్భాÛవన యాత్రకు ముఖ్య అతిధిగా హజరైనారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ముందుగా వాలీబాల్‌ పోటీలను ప్రారంభించి, వైద్య శిబిరాన్ని సందర్శించారు. జి.మాడుగుల నుండి మద్దిగరువు వరకు ఉచిత బస్సు సర్వీసును పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు తెలిపారు. అందుకు గాను ఆర్‌.టి.సి వారికి పోలీస్‌ శాఖ ఏడాదికి 1.5 లక్షల చొప్పున చెల్లిస్తుందన్నారు. గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందడం కొందరికి ఇష్టం లేదని, యువతకు పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే శక్తులను గ్రామాలకు రానీయవద్దని గిరిజనులను కోరారు. కార్యక్రమంలో ఓఎస్డీ కృష్ణారావు, పాడేరు డిఎస్పీ రాజ్‌కమల్‌, సి.ఐలు శ్రీనివాసరావు, ప్రేమ్‌ కుమార్‌, సాయి, వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని