యూనిట్
Flash News
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ కట్టుబడి ఉంది
పోలీసులు
తమ జీవితాలను నిస్వార్ధంగా ప్రజాసేవకే అంకితం చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు
శాఖ కట్టుబడి వుందని రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు అన్నారు. విజయవాడ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలను ప్రారంభించిన సందర్భముగా ఆయన
మాట్లాడారు. విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో ఓపెన్
హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ సిబ్బందికి నూతనంగా ప్రవేశపెట్టిన
వారాంతపు సెలవు బాగుందని, దీని పై ఒక
యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు. సిబ్బందికి వారాంతపు సెలవు ఎప్పుడెప్పుడు
వస్తుందో తెల్సుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. పోలీస్ విధులను ప్రజలకు,
విద్యార్ధులకు తెలియజేయడానికి వారం రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పోలీస్
అమరవీరుల వారోత్సవాల సందర్భముగా పోలీసు శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్,
ఎస్‌డీఆర్‌ఎఫ్‌లు ఏర్పాటు చేసిన ప్రదర్శనను విద్యార్దులతో
తిలకించారు. కార్యక్రమంలో విజయవాడ జాయింట్ సీపీ డి.నాగేంద్రకుమార్, డిసిపిలు ఎస్.హరికృష్ణ, శ్రీమతి ఉదయరాణి,
వి.హర్షవర్ధన్ రాజు, అదనపు డిసిపిలు,
ఇన్స్‌పెక్టర్లు, ఇతర అధికారులు
పాల్గొన్నారు.