యూనిట్
Flash News
పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తారు

పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తారు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదని, గుంటూరు పోలీసు వారు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, అమాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణల నేపథ్యంలో, అవన్నీ అవాస్తవాలని పోలీసులు ప్రజలకు సేవ చేయడంలో సమతుల్యంగా మరియు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నట్లు ఐజిపి వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. జిల్లా ఎస్.పి. ఆర్.జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐజిపి మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ తరువాత గుంటూరు రూరల్ జిల్లాలో ఎలాంటి హత్యలు, పొలిటికల్ మర్డర్స్, పెద్ద శాంతి భద్రతల సమస్యలు లేకుండా చేశామన్నారు. ముందస్తు సమాచారంతో ప్రో యాక్టివ్‌గా పనిచేశామన్నారు. 2014 ఎన్నికల తరువాత గుంటూరు రూరల్ జిల్లాలో 3 రాజకీయ హత్యలు, 2 హత్యాప్రయత్నాలు, కలిపి మొత్తం 5 క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎస్.పి. ఆర్.జయలక్ష్మి తెలిపారు. 2019 ఎన్నికల ఫలితాల తరువాత కేవలం 3 హత్యాప్రయత్నాల కేసులు మాత్రమే నమోదైనట్లు చెప్పారు. ఫిర్యాది ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చినా, ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా తెలిపినా కేసు నమోదు చేసి దాని ఫ్యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సోమవారము జిల్లా పోలీసు కార్యాలయములో స్పందన కార్యక్రమము నకు వచ్చిన ప్రతీ ఫిర్యాదును తీసుకొని వాటిపై వారం రోజులలోగా చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసులు ఒక వైపే పనిచేస్తున్నారు అనేది అవాస్తవం. ఎన్నికల తర్వాత ఎటువంటి అల్లర్లు జరుగకుండా ముందస్తు చర్యలలో భాగంగా 127 గ్రామాలలో పోలీసు అధికారులు నైట్ హాల్ట్ లు(రాత్రి బస) చేయడం జరిగిందన్నారు. ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్ల సందర్భముగా అల్లర్లు జరిగిన ప్రాంతాలను అధికారులు మరియు సిబ్బంది సందర్శించామన్నారు. ఎన్నికల అనంతరం గ్రామాలలో చెడు నడవడిక గల వారిని గుర్తించి 46 మందిపై రౌడీ షీట్లను, 36 మందిపై సస్పెక్ట్ షీట్లను ఓపెన్ చేయడం జరిగింది. ఏవ్యక్తి వచ్చి రిపోర్ట్ ఇచ్చినా కేసు కట్టి అతనికి న్యాయం చేస్తామన్నారు. రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి : పల్నాడులో ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించవద్దన్నారు. పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరగని ఎడల సదరు సమస్యలను సంబంధిత డిఎస్‌పి గారికి గాని లేదా ఎస్.పి. గారికి తెలియ పరచవచ్చన్నారు. పోలీసులు ప్రజల కోసమే పనిచేయుచున్నారు. ఎటువంటి సమస్యనైనా సత్వరమే పరిష్కరించి తగిన న్యాయం చేయుట జరుగుతుందన్నారు. ప్రజా శ్రేయస్సు ద ష్ట్యా ప్రజా శాంతికి భంగం కలిగించే వారు ఏ రాజకీయ పార్టీ వారైనా, వారు ఎంతటి వారైనా అట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.