యూనిట్
Flash News
ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
విశాఖపట్నం
జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ఎదుట మావోయిస్టు గాలికొండ ఏరియా ఏసీఎం మరియు ఇద్దరు దళ
సభ్యులు లొంగిపోయారు. ఈ సందర్భముగా ఎస్పీ మాట్లాడుతూ ఏసీఎంగా పనిచేసిన వంతల రాము
అలియాస్ బంగార్రాజు మరియు సభ్యులు పాంగి లక్ష్మణ్, గొల్లూరు దేవి అలియాస్ జ్యోతిలు స్వచ్చందంగా లొంగిపోయినట్లు తెలిపారు.
ప్రభుత్వ పథకాలుకు ఆకర్షితులై లొంగిపోతున్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారిపై
ఉన్న రివార్డులను వారికే అందజేసి, జీవనోపాధి
కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బొడ్డేపల్లి క ష్ణారావు, సి.ఆర్.పి.ఎఫ్ కమాండెంట్ సారంగి ఇతర అధికారులు పాల్గొన్నారు.