యూనిట్

మహిళలకు రక్షణ దిశా చట్టం

మహిళల పట్ల చెడు ఉద్ధేశ్యంతో వ్యవహరించే వారికి దిశ చట్టం సింహస్వప్నమని అనంతపురము రేంజ్ డి.ఐ.జి కాంతిరాణా టాటాజిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబులు సంయుక్తంగా అభిప్రాయపడ్డారు. అనంతపురంలోని పోలీసు కన్వెన్సన్ సెంటర్లో జిల్లా ఎస్పీ  భూసారపు సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో శుక్రవారం " దిశ మాసం... మహిళా మిత్ర..సైబర్ మిత్ర" లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నుంచి వాసవ్య మహిళా మండలి అధ్యక్షులుజిల్లా చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు. మహిళ పోలీస్ ఉద్యోగులకుసైబర్ మిత్రమహిళా మిత్ర సభ్యులుమహిళా మిత్ర కో ఆర్డినేటర్లుమహిళా పోలీసు వలంటీర్లకు దిశ చట్టంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డి.ఐ.జి ప్రసంగించారు. మహిళా మిత్రలు ఉప గ్రూపులను ఏర్పాటుచేసుకుని ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలన్నారు.

బాలల హక్కుల పరిరక్షణమహిళా చట్టాలుప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. పోలీసుశాఖలోని ప్రత్యేక విభాగాలు మహిళారక్షక్ బృందాలు (షీ టీమ్స్ ) చురుగ్గా పనిచేయాలన్నారు.   సామాజిక బాధ్యతగా కనీసం ఒక మంచి పని చేసినా ఎంతో సంతృప్తి కలుగుతుందన్నారు. బాల్య వివాహాలుబాలకార్మికతమానవ అక్రమ రవాణాను నియంత్రించాలన్నారు. పాఠశాలలుకళాశాలలువసతి గృహాల్లో మంచిచెడు స్పర్శలపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమాజంలో సానుకూల దృక్పథాన్ని నెలకొల్పేందుకు నిరంతర కృషి సాగించాలన్నారు.

      ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఎలా స్పందించాలి...ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ముందుగా పలు సూచనలు చేశారు. మహిళల పట్ల చెడు ఉద్దేశంతో చూడాలంటేనే భయం తెచ్చేవిధంగా చేయడమే దిశ చట్టం యొక్క అసలైన ఉద్దేశమన్నారు. హైదరాబాద్  లో జరిగిన సంఘటన నేపథ్యంలో దిశ చట్టం వచ్చిందని... ఇందుకోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు అవుతుందని ఎస్పీ వివరించారు. ఈ చట్టం కింద ఫిర్యాదు అందిన 21 రోజుల లోపే నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ...ఇందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడటమే కాకుండా బాధితురాలికి న్యాయం జరిగేలా కూడా పని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళా మిత్ర సభ్యులుసైబర్ మిత్రమహిళా మిత్ర కో ఆర్డీనేటర్లు ఇందులో చురుకైన పాత్ర వహించాలని ఎక్కడ నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా పనిచేయాలన్నారు.  ప్రజలకుపోలీసులకు వారధిగా మహిళా మిత్రలుమహిళా మిత్ర కోఆర్డినేటర్లు కీలకపాత్ర పోషించాలన్నారు. సమాజంలో మహిళల భద్రతసంరక్షణ అందరి బాధ్యత అన్నారు.  దిశ చట్టాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలుచేయడానికి వ్యవస్థలను బలోపేతం చేస్తామన్నారు. అన్ని శాఖల సమన్వయంసమిష్టి కృషితో బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నారు. సమాజంలో చక్కటి వాతావరణం నెలకొనేలా ప్రతిఒక్కరూ  పాటుపడాలన్నారు. సమస్యను అనేక కోణాల్లో ఆలోచించి తగిన పరిష్కారం చూపాలన్నారు. ఎవరైనా సరే తప్పు చేయాలంటే భయపడేలా శిక్షలు ఉండాలన్నారు. మహిళా పోలీసుస్టేషన్ లను "దిశ" స్టేషన్ లుగా నామకరణం చేసి మరింత ఆధునీకరించనున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో సకాలంలో సరైన న్యాయం అందించాలన్నారు.

జనవరి నెలను "దిశ" మాసంగా కృతనిశ్చయందృఢసంకల్పంతో మహిళామిత్రసైబర్ మిత్ర అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతామన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ మహిళామిత్ర వాలంటీర్లుకో ఆర్డినేటర్లను ఏర్పాటు చేశామన్నారు. వార్డుగ్రామ సంరక్షణ కార్యదర్శులతో సమన్వయం చేసుకుని మహిళలకు రక్షణ వలయంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు దిశ చట్టం పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు పలు సూచనలు కూడా చేశారు.  ఈకార్యక్రమంలో   అదనపు ఎస్పీ జి.రామాంజినేయులుట్రైనీ ఐ.పి.ఎస్ అధికారి మణికంఠ చండోలు, "వాసవ్య" మహిళా మండలి అధ్యక్షురాలు డా. బొల్లినేని కీర్తి (విజయవాడ)బాలల సంక్షేమ సమితి (CWC) ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి,  ఐసిడిఎస్ పి.డి. చిన్మయాదేవిస్టేట్ రీసోర్స్ పర్సన్ సుభాషిణి, "దిశ" డిఎస్పీ మున్వర్ హుస్సేన్ ,  DCPO డా. దాసరి సుబ్రమణ్యం,

డిఎస్పీలు జి.వీరరాఘవరెడ్డిఏ.రామచంద్ర,  A. శ్రీనివాసులుమహబూబ్ బాషాలక్ష్మినాయుడువెంకటరమణషేక్ లాల్ అహ్మద్ , పలువురు సిఐలుఎస్సైలుమహిళా పోలీసు సిబ్బందినూతనంగా విధుల్లో చేరిన మహిళా పోలీసులు,  తదితరులు పాల్గొన్నారు.

 

వార్తావాహిని