యూనిట్
Flash News
పోలీసు అధికారుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2020 వార్షిక క్యాలెండర్ ను శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు ఆవిష్కరణ చేశారు. జిల్లా పోలీసుల సంక్షేమానికి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని పూర్తి స్ధాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ డి వి రమణ మూర్తి, ఎ ఓ సురేష్ బాబు, ఎస్పీ గారి పిఎ రంగస్వామి, ఆర్ ఐలు రామక్రిష్ణ, జార్జ్, శివారెడ్డి, రాధాక్రిష్ణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ రెడ్డి, కోశాధికారి శ్రీ చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు నాగన్న, వెంకటేశ్వర్లు, మల్లికార్జున, పోలీసు హౌసింగ్ సోసైటి అధ్యక్షులు రఘురాముడు పాల్గొన్నారు.