యూనిట్
Flash News
స్పందనలో వినతుల వెల్లువ

అనంతపురం
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన
స్పందనలో పిటీషనర్లు స్వేచ్ఛగా సమస్యలు చెప్పుకున్నారు. జిల్లా పోలీసు
కార్యాలయంలోని తన ఛేంబర్ నుండే ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు జిల్లాలోని పోలీసు
అధికారులతో జూమ్ అప్లికేషన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పందన తీరును
పర్యవేక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన
కార్యక్రమంలో 146 పిటిషన్లు స్వీకరించారు. ప్రతీ
ఫిర్యాదిదారి నుండీ సమస్యలు ఎస్పీ ఓపికగా విన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కారం
చూపేలా జాగ్రత్తలు చేపట్టారు.
జిల్లా
వ్యాప్తంగా 183 ఫిర్యాదుల స్వీకరణ
జిల్లా
వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, సబ్ డివిజనల్
కార్యాలయాలు, తదితర పోలీస్ కార్యాలయాల్లో
నిర్వహించిన స్పందనలో మొత్తం 183 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో జిల్లా పోలీసు కార్యాలయంలో
ఎస్పీ నిర్వహించిన స్పందనలో 146 ఫిర్యాదులు ఉన్నాయి.
ప్రతి చోటా పిటిషనర్ల పట్ల
మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి
వినతులను తీసుకున్నారు. పరిష్కారం తారీఖు నమోదుచేసి పిటిషనర్ల రసీదులు
అందజేశారు.