యూనిట్

కమాండెంట్‌కు పోలీసు కుటుంబాల కృతజ్ఞతలు

3వ పటాలం ఆవరణలో పోలీసు కుటుంబ సభ్యుల మహిళలతో కమాండెంట్‌ బి.శ్రీరామమూర్తి మహిళా దర్బార్‌ నిర్వహించారు. ముందుగా పటాలములో చదివే సిబ్బంది పిల్లలకు ఫీజుల్లో రాయితీ, ఇంటింటికీ మినరల్‌ వాటర్‌, సిపిఎస్‌ క్యాంటిన్‌ తదితర సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు గాను మహిళలు కమాండెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కమాండెంట్‌ మాట్లాడుతూ పోలీసుసంక్షేమంలో భాగంగా పరిష్కరించవలసిన సమస్యల్లో సులువైనవి వెంటనే తీర్చడం జరిగిందని, మిగతా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందన్నారు. వాటిని కూడా త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పటాలము యూనిట్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ శ్రీమతి జి.లక్ష్మి, ఆర్‌.ఐ.లు బి.రామకృష్ణ, బిఎస్‌సి శేఖర్‌, సతీష్‌కుమార్‌, ఆర్‌.ఎస్‌.ఐ. వై.వి.వి.సత్యనారాయణ, అధికారుల సంఘం ప్రతినిధులు రాజేష్‌, రాజు, ఇతర పోలీసు సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

వార్తావాహిని