తిరుపతి
యస్.వి.యు ఆడిటోరియం నందు 31 వ రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా తిరుపతి
అర్బన్ జిల్లా పోలీస్ ట్రాఫిక్ విభాగము మరియు తిరుపతి ప్రాంతీయ రవాణా శాఖ విభాగపు
అధికారులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి డా. గజరావు
భూపాల్ ,
తిరుపతి యం.యల్.ఏ. భూమన కరుణాకర్ రెడ్డి మరియు డిప్యూటీ
ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ యం.బసి రెడ్డి
పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంబించారు.
ఈ సందర్భంగా
జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు రహదారి భద్రత నియమాలను ప్రతి
ఒక్కరూ భాద్యతగా పాటించినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయని, ప్రమాద రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలన్నారు. డ్రైవింగ్
చేసే సమయంలో మనసు ఏకాగ్రత గా ఉంచుకోవా లన్నారు. అదే సమయంలో ఫిజికల్ ఫిట్నెస్ కూడా
ఉండాలన్నారు. ప్రమాదాల పట్ల ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలన్నారు. వాహనం నడుపు ఒక
డ్రైవర్ చేతిలోనే తన కుటుబంతోపాటు
ఎదుటివారి కుటుంబాల జీవితాలు కూడా ఉంటాయాన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.
మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహానాలు నడపడం, ఓవర్ టేకింగ్ చేయడం వంటి వాటి నిర్లక్ష్యపు చర్యల వలనే
ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రహదారి భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా
తీసుకున్నప్పుడే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్
లైసెన్సులు తీసుకోవడంతోపాటు రహదారి నియమాలను పాటిస్తే ప్రమాదాల సంఖ్యను
పూర్తిగా తగ్గించవచ్చన్నారు. ద్విచక్ర
వాహనదారులు రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని శిరస్త్రానము ఒక
బరువుగా కాకుండా ఒక బాధ్యతగా భావించాలన్నారు.
మనమీదే ఆశలు పెట్టుకున్న ఎంతో మంది కుటుంబసభ్యులు మనం క్షేమంగా రావాలని
ఇళ్లలో ఎదురుచూస్తుంటారని ప్రతిక్షణం గుర్తుఎంచుకోవాలన్నారు. ముఖ్యంగా యువత దీనిని
గుర్తించుకోవాలని, మనం ఎంత జగ్రత్తగా
వాహనం నడిపితే ఎదుటివారు కూడా అదే జాగ్రత్తతో వాహనం నడుపుతారని కావున ప్రతి ఒక్కరు
ట్రాఫిక్ రూల్స్ ను విదిగా పాటించాలని విజ్ఞప్తి చేసారు.
యం.యల్.ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
మాట్లాడుతూ ప్రమాదాలు ఆగాలంటే స్పీడ్ తో పాటు ట్రాఫిక్ రూల్స్ ను కూడా పాటించాలని
ముఖ్యంగా యువత మీద వారి తల్లితండ్రులు ఎక్కువగా ఆశలు పెట్టుకొని ఉంటారని, ఎంత స్పీడ్ గా వెళ్ళినా తేడా పెద్దగా లేకపోయినా ప్రమాదాలు
ఎక్కువగా జరుగుతుంటాయని కావున వీటిని గమనించి అందరు రోడ్ బాధ్రతా నియమావళిని
పాటించాలని సూచించారు.
ఈ అవగాహన
ర్యాలీ మరియు కార్యక్రమానికి వచ్చిన ఏ.పి.యస్.ఆర్.టి.సి డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, మ్యాక్సి
క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, కాలేజీ విద్యార్తినీ
విద్యార్ధులు, పోలీస్ ట్రైనింగ్ కాలేజీ శిక్షణా
సిబ్బంది అందరికీ రోడ్డు బద్రతా విదానాలపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యస్.బి డి.యస్.పి
గంగయ్య ,
వెస్ట్ డి.యస్.పి నరసప్ప, ట్రాఫిక్ సి.ఐ సురేష్ కుమార్ , రవాణా శాఖ
అధికారులు, హాజరైనారు.