యూనిట్
Flash News
వృద్ధులను దైవంతో సమానంగా చూడాలి
తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వారిని దైవంతో సమానంగా భావించాలని 11వ పటాలము కమాండెంట్ ఎన్.శ్రీనివాసరావు అన్నారు. పటాలము పరిధిలోని చౌడమ్మ వృద్ధాశ్రమాన్ని కమాండెంట్ సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఉపయోగపడే బట్టలు, ఫలాలు, ఇతర వస్తువులను కమాండెంట్ అందజేశారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ వృద్ధులను ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని, ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం వస్తుందని ఈ విషయాలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. వృద్ధాశ్రమంలో కొద్దిసేపు కమాండెంట్ సరదాగా గడిపారు. కార్యక్రమంలో ఆర్.ఎస్.ఐ. కె.వి.బి. వర్మ, ఇతర అధికారులు, ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.