యూనిట్
Flash News
హోంగార్డుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం కృషి
జనవరి 25,
2018నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం మంగళగిరి కాన్ఫరెన్స్‌హాల్‌లో
కేంద్ర ప్రభుత్వ డైరక్టర్ జనరల్ ఫైర్ సర్వీసెస్, హోంగార్డ్స్ మరియు సివిల్ డిఫెన్స్
డైరెక్టర్ శ్రీ ప్రకాశ్ మిశ్రా గారు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ డా|| యం. మాలకొండయ్య
గారు రాష్ట్ర్ట పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా
ఐజీపీ హోంగార్డ్స్ కృపానంద్ త్రిపాఠి ఉజాల మన రాష్ట్రంలో హోంగార్డుల స్థితిగతులు,
వారి సంక్షేమం కొరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖ చేపడుతున్న వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా
శ్రీ ప్రకాశ్ మిశ్రాగారు మట్లాడుతూ హోంగార్డ్స్ సంక్షేమ నిధులలో 25శాతం కేంద్రప్రభుత్వ
నిధులను మన రాష్ట్రానికి విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. హోంగార్డులకు
వేతనాలు వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా వున్నాయి వీటన్నింటిని ఒకే వేతనంగా జాతీయ
స్థాయిలో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అందరికి ఒకే వేతనం వర్తించేలా
అమలుకు కషి చేస్తానని తెలిపారు. హోంగార్డుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వ సహకారం మరింతగా
అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ రకాల విపత్తుల అగ్నిమాపక సేవలను, రోడ్డుప్రమాదాల
సమయంలో హోంగార్డుల సేవలు అందుబాటులోకి వచ్చేవిధంగా వారికి శిక్షణ ఇచ్చి హోంగార్డులలో
నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కేంద్రప్రభుత్వం తరుపున చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు డీజీపీ శాంతిభద్రతలు హరీష్ కుమార్ గుప్త, సి.ఐ.డి చీఫ్, అదనపు
డీజీపీ సి.హెచ్. ద్వారాక తిరుమలరావు, ఐజీపీ సి.ఐ.డి పి.వి.సునీల్ కుమార్, ఇతర సీనియర్
పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.