యూనిట్
Flash News
తప్పిపోయిన బాలుని అప్పగించినందుకు పశ్చిమ ఎస్పీకి కృతజ్ఞతలు
పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం ఏపూరు గ్రామానికి చెందిన
దేవన బోయిన దుర్గారావు తన యొక్క కుమారుడు తప్పిపోయిన విషయంపై స్పందన కార్యక్రమం లో
ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ని కలిసి ఫిర్యాదు చేసాడు. వెంటనే స్పందించిన ఎస్పీ సదరు ఫిర్యాదును పెదపాడు పోలీస్ స్టేషన్ వారికి పంపించి త్వరితగతిన బాలుని కనుగొని తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశాలు
జారీ చేసారు. దీనితో పెదపాడు పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందించి కేసు నమోదు
చేసి, బాలుని యొక్క ఆచూకీ టీ. నర్సాపురం లో కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందుకుగాను బాలునితో సహా అతని
తండ్రి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఐపీఎస్ ను కలిసి శాలు వను బహుకరించి, కృతజ్ఞతలు తెలుపుకున్నారు.