యూనిట్
Flash News
కిడ్నాప్ అయిన బాలిక తల్లిచెంతకు
తిరుపతిలో
తన కుమార్తె అపహరణకు గురైందని తిరుపతి తూర్పు పోలీసులను ఓలమ్మ అనే బాధితురాలు
ఆశ్రయించింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో ఓ యాచకురాలు తన వృత్తికి పనికి వస్తుందనుకొని బాలికను కిడ్నాప్
చేసినట్లు తేలింది. కేసు వివరాలను అదనపు ఎస్.పి. అనిల్‌బాబు మీడియాకు వివరించారు.
అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఓలమ్మ తన భర్తను కోల్పోయింది. అంతేగాకుండా
రైలు ప్రమాదంలో తన కాలును పోగొట్టుకుంది. దీంతో జీవనం కోసం రైల్వే స్టేషన్‌లో తన
కుమార్తె శ్వేతతో భిక్షాటన చేస్తూ బతుకీడుస్తోంది. ఈ క్రమంలో తన కుమార్తె రైల్వే
స్టేషన్‌లో తప్పిపోయిందని తెలిపారు. స్థానిక బాలల సంక్షేమ సమితి సహకారంతో చిన్నారి
ఫోటోలను విస్తృతంగా ప్రచారం చేశారు. డిఎస్‌పి మురళీకృష్ణ, సీఐ శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఐ
ఇమ్రాన్‌బాషాలు దర్యాప్తులో భాగంగా కర్నాటక రాష్ట్రం కోలారులోని బాలల సంక్షేమ
సమితి సభ్యులు బాలికను గుర్తించి ఎస్.ఐ. ఇమ్రాన్‌బాషకు సమాచార మిచ్చారు. చిన్నారి
శ్వేతను ఓ వృద్ధురాలు బిక్షాటన కోసం తీసుకెళ్ళినట్లు తెలిసింది. వెంటనే బాలికను
గుర్తించినట్లు తల్లి ఓలమ్మకు సమాచార మిచ్చారు. అదనపు ఎస్.పి. అనిల్‌బాబు
ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో చిన్నారి శ్వేతను తల్లికి అప్పగించారు. కేసును
త్వరితగతిన చేధించిన సిబ్బందిని అదనపు ఎస్.పి. అభినందించారు.