యూనిట్

చక్కెర ఫ్యాక్టరీ బకాయిలు ఇప్పించి తమకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్.పి గారిని ఆశ్రయించిన చెరకు రైతులు

తాము కష్టించి సాగు  చేసిన చెరకు పంటను ఏడాది పాటు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కి చెందిన సూదలగుంట సుగర్స్ లిమిటెడ్ కు విక్రయించామని, తమకు రావాల్సిన కోటి రూపాయల బకాయిలను ఇప్పించి తమకు న్యాయం చేయాలని చాపాడు మండలం తిమ్మాయపల్లి, ప్రొద్దుటూరు మండలం సీతంపల్లి గ్రామాలకు చెందిన 20 మంది  చెరకు రైతులు  జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్.అన్బురాజన్ ఐ.పి.ఎస్., గారికి విజ్ఞప్తి చేసారు. ఫ్యాక్టరీ యాజమాన్యం పంట సాగు కు కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో రైతులకు చెల్లించారని, తమకు విత్తన చెరుకు కూడా అందచేశారన్నారు. జనవరి 2018  నుండి ఫిబ్రవరి 2019  వరకు   సంవత్సరం పాటు కష్టపడి సాగు చేసి కటింగ్ చేసి ఫ్యాక్టరీకి తరలించి ఇచ్చామని వివరించారు.  ఫ్యాక్టరీ యాజమాన్యం అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తం  పెట్టుబడి కి సరిపోక తమ బంగారు నగలు, భూములను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి తెచ్చిన డబ్బులతో చెరకును సాగు చేశామని తెలిపారు. ఓ వైపు బ్యాంకు అధికారులు ఋణం చెల్లించకుంటే బంగారు, భూములను వేలం వేస్తామంటూ నోటీసులు ఇచ్చారని, కానీ ఫ్యాక్టరీ వారినుండి రావలసిన బకాయిలు ఇవ్వమని ఎన్నిసార్లు అడిగిన కూడా వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. 

 తక్షణం స్పందించిన జిల్లా ఎస్.పి గారు విచారణకు ఆదేశించారు. ఫిర్యాదును పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

వార్తావాహిని