యూనిట్

అమరవీరుల త్యాగాలను విద్యార్థులు తెలుసుకోవాలి

నిత్యం ప్రజా సేవ చేసుకుంటూ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన పోలీస్‌ అమరవీరుల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని తిరుపతి డిఎస్‌పి నందకిషోర్‌ అన్నారు. పోలీసు సంస్మరణ వారోత్సవాల సందర్భంగా తిరుపతి పెరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌.పి. ఆదేశాల మేరకు ఓపెన్‌ హౌస్‌ను ప్రారంభించారు. మొదటిరోజు డ్రౌండ్‌లో పోలీసులు ఉపయోగించే వివిధరకాల ఆయుధాలను బాంబు లను విద్యార్థులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వివిధ స్కూల్లో నుంచి హాజరైన విద్యార్థులకు పోలీసులు ఉపయోగించే సాయుధ ఆయుధాల గురించి వివరించారు. నిరంతరం ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతూ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడే వ్యక్తి పోలీసులు అన్నారు. పోలీస్‌ స్టేషన్లో రికార్డ్స్‌, ఎఫ్‌ఐఆర్‌ గురించి వివరించారు. ఈ కార్యక్ర మంలో ఆర్‌ఐలు శ్రీనివాసులు, సుధాకర్‌,స్కూల్‌ నుంచి వచ్చిన విద్యార్థులు హాజరయ్యారు.

వార్తావాహిని