యూనిట్

సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

ఇటీవల ఒక హిందూ జైన బాలికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఒక ముస్లిం బాలుడు వివాహం కోసం తీసుకెళ్లారు. జైన సంఘ సభ్యులందరూ జిల్లాలో ఒక సమావేశం నిర్వహించుకొని, ముస్లిం ఉద్యోగులందరినీ వారి యొక్క వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థల నుండి తక్షణమే రద్దు చేస్తామని ఏకగ్రీవంగా నిర్ణయించారు. 10,000 మందికి పైగా ముస్లింలు ఉపాధిని కోల్పోవడంతో ఫలితం దిగ్భ్రాంతికి గురిచేసింది, కాబట్టి వారి సంఘ పెద్దలు, మత సంఘ నాయకులు అత్యవసర సమావేశాన్ని పిలిచి జైన అమ్మాయిని గుర్తించి ఆమె కుటుంబానికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. తొమ్మిది గంటల లోపు బాలికను గుర్తించి కుటుంబానికి అప్పగించడం జరిగింది. ఇది ఒక యునైటెడ్ కమ్యూనిటీ యొక్క కఠినమైన నిర్ణయం పర్యావసానంగా పొందిన విజయం. నెల్లూరు జిల్లాలోని జైన కమ్యూనిటీ సభ్యుల ఐక్యతకు హ్యాట్సాఫ్.”

                        అని వాట్స్ అప్  ద్వారా వాస్తవాలకు విరుద్దంగా అమాయక ప్రజలకు ఆందోళన కలిగించే విధంగా భాద్యతారహితంగా కొన్ని గ్రూపులలో ఇంగ్లీష్ బాష లో సర్క్యులేట్ చేయబడిన పై సమాచారాన్ని “ఖండిస్తున్నాము”. ఈ ఘటన నెల్లూరు సిటీలోనే కాకుండా జిల్లాలో మరెక్కడా జరగలేదు. 

                        ప్రజల మధ్య జాతి, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాట్స్ అప్  ద్వారా సోషల్ మీడియా లో వైరల్ చేసేందుకు, ఇలాంటి ఫేక్ మెసేజ్ లు ఎవరైనా గ్రూపులకు పంపినా, సోషల్ మీడియా లో సర్క్యులేట్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా  ఎస్పీ భాస్కర్ భూషణ్,   ఈ సందర్భంగా హెచ్చరించారు.

వార్తావాహిని