యూనిట్

అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు: గుంటూరు ఎస్పీ

ది.22-01-20 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు విషయంగా అమరావతి జె. ఏ సి తలపెట్టిన బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలతో పాల్గొనే వారి పైన చట్టబద్దమైన చర్యలు తీసుకోవడం జరుగు తుందని గుంటూరు అర్బన్ మరియు రురల్ ఎస్పీలు పి.హెచ్.డి. రామకృష్ణ, సిహెచ్. విజయరావు లు సంయుక్త ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్బమగు వారు కొన్ని హెచ్చరికలు జారీ చేసారు. గుంటూరు అర్బన్, రూరల్ పరిధుల్లో విద్యార్ధులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు మరియు పబ్లిక్ / ప్రయివేటు రవాణాకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరూ అవాంఛనీయ కార్యక్రమాలు నిర్వహించరాదని, బలవంతంగా షాపులు, విద్యాసంస్థలు మూయించడం చేయరాదని, తెలియపర్చడమైనది.

వార్తావాహిని