యూనిట్
Flash News
CAP హాస్టల్ ను సందర్శించిన రాష్ట్ర సమాచార కమీషనర్
రాష్ట్ర సమాచార కమీషనర్ బి.వి.
రమణ కుమార్ (Retd IPS) తేది.09.01.2020 న మధ్యాహ్నం 3
గంటలకు నెల్లూరు టౌన్ లో పొదలకూరు రోడ్డు లో ఉన్న DCR ZP హైస్కూల్ ను సందర్శించి HM శ్రీమతి యం.జయమ్మ గారి
సమక్షంలో క్యాప్ బాలలతో ఇంటరాక్ట్ అయ్యారు. తదుపరి సాయంత్రం 5 గంటలకు బి.వి. రమణ కుమార్ కొండయపాలెం
గేటు వద్ద గల క్యాప్ హాస్టల్ నందు జిల్లా ప్రిన్సిపల్ మరియు సెషన్స్ జడ్జి జి.వెంకట క్రిష్ణయ్య మరియు
జిల్లా యస్.పి భాస్కర్ భూషణ్, IPS., నెల్లూరు RDO డి.హుస్సేన్ సాహెబ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మెన్
శ్రీమతి సురేఖ, సర్వశిక్షా అభియాన్ ALSO శ్రీమతి D.జయ భారతిలతో సమావేశం
నిర్వహించారు.
ఈ సందర్భంగా బి.వి. రమణ కుమార్ గారు
మాట్లాడుతూ నూతనంగా జిల్లా యస్.పి. గా భాద్యతలు స్వీకరించిన భాస్కర్ భూషణ్, IPS., గారిని క్యాప్ బాలలకు మొదటగా పరిచయం చేసి, క్యాప్
ప్రాజెక్ట్ ఆవిర్భావం గురించి వారికి క్లుప్తంగా తెలిపారు. క్యాప్ నుండి 10
వ తరగతి చదువుతున్న బాలలు ఎవరైతే మార్చిలో బోర్డు పరీక్షలు
రాయనున్నారో వారికి ట్యూషన్ సదుపాయాలు, గర్ల్స్ హాస్టల్ నందు
మౌలిక వసతులు ఏర్పాటుతో పాటు రక్షణ చర్యలు మొదలగు అంశాల గురించి చర్యలు
తీసుకోవాల్సిందిగా జిల్లా యస్.పి. గారిని కోరారు. ఈ సందర్భంగా జిల్లా యస్.పి. గారు
మాట్లాడుతూ క్యాప్ బాలలు అందరూ కూడా దైవ సమానులని, అంకిత
భావంతో కష్టపడి చదివి మంచి ఉన్నత స్థితికి చేరాలని, మార్టిన్
లూథర్ కింగ్ మరియు భారత ప్రధమ రాష్ట్రపతి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గార్లు కూడా దయనీయ
స్థితి నుండే కష్టపడి చదివి
ప్రపంచం గర్వించ దగ్గ నాయకులుగా ఎదిగారని తెలుపుతూ, క్యాప్
బాలల అవసరాలు అన్నీ తీర్చడంతో పాటు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి గారు మాట్లాడుతూ సేవలోనే ఆనందం, దైవత్వం
చేకూరుతాయని, భగవంతుడు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక నైపుణ్యాన్ని
సమకూర్చి ఉంటాడని దాన్ని బయటకు తీసి సానపట్టాల్సిన భాద్యత మన మీద ఉన్నదని
తెలిపారు. చివరిగా
గూడూరు శ్యాం గారు బహుకరించిన కేకును కట్ చేసి బాలల జన్మదిన వేడుకలు జరిపి వారికి
శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేసారు.
ఈ కార్యక్రమాలలో పై అధికారులతో పాటు
డాక్టర్ ప్రసాద్ NRO, శ్రీమతి లక్షీ, క్యాప్
ప్రాజెక్ట్ అడ్వైజర్ డా..ప్రసాద్, CI దర్గామిట్ట, RI హోం గార్డ్స్ మొదలగు వారు పాల్గొన్నారు