యూనిట్

అసోసియేషన్‌ కార్యాలయం ప్రారంభం

11వ పటాలము ఆవరణలో నూతనంగా నిర్మించిన పోలీసు సిబ్బంది అసోసియేషన్‌ కార్యాలయాన్ని కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ మాట్లాడుతూ సిబ్బంది సమస్యలు, పరిష్కార మార్గాలు తెలుసుకునేందుకు అసోసియేషన్‌ కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ కె.ప్రభుకుమార్‌, అసిస్టెంట్‌ కమాండెంట్లు పి.సౌకత్‌ అలి, వి.కేశవరెడ్డి, ఆర్‌.ఐ. డి.వి.రమణ, ఇతర అధికారులు అసోసియేషన్‌ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని