యూనిట్
Flash News
పారదర్శకంగా సిబ్బంది బదిలీలు
కృష్ణా
జిల్లాలో పని చేస్తున్న పోలీస్ సిబ్బందికి కానిస్టేబుల్ నుండి ఏఎస్సై వరకు
బదిలీలను జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు పారదర్శకంగా నిర్వహించారు. వారం రోజుల
పాటు కౌన్సిలింగ్ నిర్వహించి ఉన్న ఖాళీలు బట్టి కోరుకున్న స్థానాలకు బదిలీలు
చేశారు. ఒక పోలీస్ స్టేషన్‌లో 5
సంవత్సరాలు, సర్కిల్‌లో 7 సంవత్సరాలకు
పైబడి సర్వీసులో వున్న వారికి బదిలీలను నిర్వహించారు. ఈ సందర్భముగా ఎస్పీ
మాట్లాడుతూ బదిలీల ప్రక్రియకు సంబంధించిన వివరాలు ముందుగానే సేకరించామన్నారు. ఏ ఏ
పోలీస్ స్టేషన్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ముందుగానే తయారు చేసి ఆన్‌లైన్ ద్వారా
సమాచారాన్ని పంపించడం జరిగిందన్నారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుపుతూ భారీ
స్క్రీన్‌లను ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు.