యూనిట్
Flash News
డయల్ 100పై క్షణాల్లో ప్రాణాలు కాపాడిన శ్రీకాకుళం పోలీసు

విజయనగరం
జిల్లా గురుగుబెల్లి మండం చికం జంక్షన్ వద్ద అర్ధరాత్రి సుమారుగా ఒంటి గంట సమయంలో
చత్తిస్‌గఢ్ నుండి శ్రీకాకుళానికి ఏడుగురు సభ్యులు కారులో వస్తుండగా కారు అదుపుతప్పి, పల్టీ
కొట్టింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో చల్లపల్లి రవి, వర్మ, తవుడు ఈశ్వర వర్మతో పాటుగా చిన్నాయి నిశాంత్
వర్మ గౌరీవర్మలు గాయపడ్డారు. క్షతగాత్రులో ఒకరు డయల్ 100కి
కాల్ చేశారు. శ్రీకాకుళం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ కనెక్ట్ అయింది.
హోంగార్డు తమ్మినేని రామకృష్ణ ప్రమాదం తీవ్రతను అంచనా వేసి, ప్రమాదం జరిగిన స్థలం
విజయనగరం బార్డర్‌లో ఉందని గ్రహించాడు. ముందుగా సమీపంలోని వీరఘట్టం పోలీస్
స్టేషన్ ఉందని, ముందుగా 108 వాహనానికి
ఫోన్ చేసి, ప్రమాద స్థలాన్ని వివరించాడు. ఎస్.ఐ. జి
భాస్కర్ రావు, హెడ్ కానిస్టేబుల్ టీ పోలయ్య, కానిస్టేబుల్ కే.రామకృష్ణ, హోంగార్డు కే.రమణ మూర్తి,
బి. చిన్నారావు, రామకృష్ణ, సీపీవో ఆర్. రవి రాజాతో హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 వాహనంలో పార్వతీపురం ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. సరైన
సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి అభినందించారు. ఈ
కార్యక్రమంలో డీఎస్పీ రారాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.