యూనిట్
Flash News
బత్తనపల్లి, తాడిమర్రి పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ
శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పి ఎస్.
వి.మాధవరెడ్డి నేడు ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోని బత్తనపల్లి, తాడిమర్రి పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ
సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు,
విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్,
వివిధ క్రైమ్ రికార్డ్స్ లను పరిశీలించి, పోలీస్
స్టేషన్ పరిసరాలను, స్టేషన్ లో సీజ్ చేయబడిన వాహనాలను మొదలైన
వాటి గురించి సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు.
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచండి.స్టేషన్ పరిధిలోని వివిధ
ప్రాంతాల గురించి,ఆయా గ్రామాలలోని స్థానిక నాయకుల గురించి,
మరియు స్టేషన్ పరిదిలో ప్రస్తుత పరిస్థితులను గురించి స్టేషన్ సిబ్బందినీ అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ కి వచ్చే ప్రజల పట్ల మర్యాదగా
వ్యవహరిస్తూ, వారికి సేవలందించాలని తెలియజేశారు.