యూనిట్
Flash News
డయల్ 100 కి వెంటనే స్పందించిన శ్రీ కాళహస్తి మహిళా రక్షక్ టీం
7-01-2020 వ తేది ఉదయం 10:30 గంటలకు తిరుపతి కమాండ్ కంట్రోల్ పోలీస్ డయల్ 100 నెంబర్ కి ఫోన్ కాల్ వచ్చింది. శ్రీ కాళహస్తి స్వర్ణముఖి నది బ్రిడ్జి పై ఒక సుమారు 65 సం” గల వృద్దురాలు అనుమాన స్పదంగా తచ్చాడుతూ వుందని సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది శ్రీ కాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలోని మహిళా రక్షక్ టీం కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా మహిళా రక్షక్ టీం వారు స్వర్ణముఖి నది బ్రిడ్జి వద్దకు చేరుకొని వృద్దురాలిని గుర్తించి శ్రీ కాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు అప్పగించి విచారించగా, తనపేరు పి.కనక భూషణమ్మ, వయసు 65 సం”రాలు లేట్ అరుముగం, బి.పి అగ్రహారం శ్రీ కాళహస్తి అని, తన కొడుకుతో గొడవపడి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటినుంచి వచ్చేశానని తెలిపారు. తదుపరి ఆమె యొక్క కుటుంబ సభ్యులను పిలిపించి ఆమెతోపాటు వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి డా. గజరావు భూపాల్ ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు ఆమెను వారి కుటుంబ సభ్యులకు అప్పగించటం జరిగింది. వెంటనే స్పందించి వ్రుద్దురాలును కాపాడిన శ్రీ కాళహస్తి మహిళా రక్షక్ టీం కు జిల్లా యస్.పి గారు అభినందనలు తెలిపి రివార్డ్ ప్రకటించారు.